చింపాంజి లెక్క "కరోనా"
మనిషికో మాట… గొడ్డుకో దెబ్బ అంటారు పెద్దలు. కానీ గొడ్డుల్లా బాదినా కూడా చెప్పినట్లు వినడం లేదు మనుషులు. కరోనా విజృంభిస్తోంది క్వారంటైన్ లో ఉండండి బాబు అని మొత్తుకుంటే వినరే… అందుకే పోలీసులు లాఠీలకు పని చెప్పాల్సి వస్తుంది. చేతులు శుభ్రంగా కడుక్కోవాలని, సామాజిక దూరం పాటించాలని అరిచి అరిచి చెప్తున్నా పట్టించుకోరే….అందుకే కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. కనీసం ఈ చింపాంజిని చూసైనా మనలో మార్పు వస్తుందేమో చూద్దాం. కరోనా కారణంగా ఈ మధ్య […]
మనిషికో మాట… గొడ్డుకో దెబ్బ అంటారు పెద్దలు. కానీ గొడ్డుల్లా బాదినా కూడా చెప్పినట్లు వినడం లేదు మనుషులు. కరోనా విజృంభిస్తోంది క్వారంటైన్ లో ఉండండి బాబు అని మొత్తుకుంటే వినరే… అందుకే పోలీసులు లాఠీలకు పని చెప్పాల్సి వస్తుంది. చేతులు శుభ్రంగా కడుక్కోవాలని, సామాజిక దూరం పాటించాలని అరిచి అరిచి చెప్తున్నా పట్టించుకోరే….అందుకే కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. కనీసం ఈ చింపాంజిని చూసైనా మనలో మార్పు వస్తుందేమో చూద్దాం.
కరోనా కారణంగా ఈ మధ్య తన కేర్ టేకర్ గంటకోసారి చేతులు శుభ్రపరుచకోవడాన్ని చూసిన ఈ చింపాంజీ తను కూడా అలాగే చేయడం మొదలు పెట్టింది. మనకన్నా చాలా చక్కగా చేతులను కడుక్కుంటుంది. తన కేర్ టేకర్ ను చూసే ఇంత మార్పు వచ్చింది చింపాజిలో. కానీ… మనం రోజుకు వందసార్లు టీవీలు, సోషల్ మీడియాలో చేతులు శుభ్రం చేసుకోండి అనే యాడ్ చూసినా కూడా మారం. ప్రభుత్వం, సెలబ్రిటీలు దాని గురించి రోజు మొత్తుకున్నా పెడ చెవిన పెడతాం. అందుకే అంటారేమో… మనిషికన్నా పశువు నయం అని. ఈ చింపాంజిని చూశాక అక్షరాల ఇది నిజం అనిపిస్తుంది. కనీసం ఈ చింపాంజిని చూసైనా మనలో మార్పు వస్తే బాగుంటుంది.
Sandra the orangutang started washing her hands because she saw all the zookeepers doing it repeatedly during the COVID-19 crisis.
Wash your hands.
Be more like Sandra.🌎❤️🧼🌎 pic.twitter.com/t8TTizDGeD— Rex Chapman🏇🏼 (@RexChapman) April 1, 2020
Tags: CoronaVirus, Covid19, Animals, Humans