ఇంటికే అంగన్‌వాడీ సరుకులు

దిశ, న్యూస్‌బ్యూరో: గర్భిణీలు, చిన్నపిల్లలకు పౌష్టికాహారాన్ని అంగన్‌వాడీల ద్వారా ఇంటికే పంపిణీ చేస్తామని మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ స్పష్టం చేశారు. కరోనా వైరస్ నివారణలో భాగంగా సోమవారం అధికారులతో సమావేశమైన మంత్రి రివ్యూ నిర్వహించారు. అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకొని ఎవరికీ ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. అంగన్‌వాడీ టీచర్, ఆయా, గ్రామ కార్యదర్శి, ఆశా వర్కర్, స్థానిక పోలీస్‌ భాగస్వామ్యంతో గ్రామ కమిటీ ఏర్పాటు చేయాలన్నారు. సరైన సమయంలో […]

Update: 2020-03-23 06:13 GMT

దిశ, న్యూస్‌బ్యూరో: గర్భిణీలు, చిన్నపిల్లలకు పౌష్టికాహారాన్ని అంగన్‌వాడీల ద్వారా ఇంటికే పంపిణీ చేస్తామని మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ స్పష్టం చేశారు. కరోనా వైరస్ నివారణలో భాగంగా సోమవారం అధికారులతో సమావేశమైన మంత్రి రివ్యూ నిర్వహించారు. అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకొని ఎవరికీ ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. అంగన్‌వాడీ టీచర్, ఆయా, గ్రామ కార్యదర్శి, ఆశా వర్కర్, స్థానిక పోలీస్‌ భాగస్వామ్యంతో గ్రామ కమిటీ ఏర్పాటు చేయాలన్నారు. సరైన సమయంలో పౌష్టికాహారం లబ్దిదారులకు అందేలా చూడాలని సంబంధిత అధికారులను మంత్రి ఆదేశించారు.

Tags: anganvadi, pregnent womens, kids, minister satyavati rathod

Tags:    

Similar News