హాలీవుడ్ చాన్స్ కొట్టేసిన యంగ్ బ్యూటీ
దిశ, సినిమా : యంగ్ బ్యూటీ అనీషా మధోక్ హాలీవుడ్ చాన్స్ కొట్టేసింది. ‘బుల్లీ హై’ సినిమా ద్వారా హాలీవుడ్‌లోకి ఎంటర్‌కాబోతున్న బ్యూటిఫుల్ ఆస్ట్రియన్ – అమెరికన్ యాక్టర్ అండ్ ప్రొడ్యూసర్.. ఆర్నాల్డ్ స్క్వార్జెనెగర్ కుమారుడు జోసెఫ్ బైనాతో కలిసి ఈ మూవీలో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నట్లు తెలిపింది. తన లైఫ్‌లోనే ఇది బిగ్గెస్ట్ అచీవ్‌మెంట్ అని, చాలా సంతోషంగా ఉందని తెలిపింది. ఈ సినిమా మర్యమ్ అనే తన పాత్ర చుట్టూ తిరగనుండగా.. స్కూల్‌లో హిజాబ్ […]
దిశ, సినిమా : యంగ్ బ్యూటీ అనీషా మధోక్ హాలీవుడ్ చాన్స్ కొట్టేసింది. ‘బుల్లీ హై’ సినిమా ద్వారా హాలీవుడ్‌లోకి ఎంటర్‌కాబోతున్న బ్యూటిఫుల్ ఆస్ట్రియన్ – అమెరికన్ యాక్టర్ అండ్ ప్రొడ్యూసర్.. ఆర్నాల్డ్ స్క్వార్జెనెగర్ కుమారుడు జోసెఫ్ బైనాతో కలిసి ఈ మూవీలో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నట్లు తెలిపింది. తన లైఫ్‌లోనే ఇది బిగ్గెస్ట్ అచీవ్‌మెంట్ అని, చాలా సంతోషంగా ఉందని తెలిపింది. ఈ సినిమా మర్యమ్ అనే తన పాత్ర చుట్టూ తిరగనుండగా.. స్కూల్‌లో హిజాబ్ ధరించినందుకు బెదిరింపులు ఎదుర్కొనే అమ్మాయిగా కనిపించబోతున్నట్లు తెలిపింది.
పాండెమిక్ సినిమా రిలీజ్‌పై ఎఫెక్ట్ చూపిందన్న అనీషా.. తానెప్పుడూ డీమోటివేట్ కాలేదని.. ప్రస్తుతం ఇండియాలోని టాప్ మ్యూజిషియన్స్‌తో మ్యూజిక్ వీడియోస్ చేస్తున్నట్లు వివరించింది. ‘అలీజా – ఫ్రీ’ సినిమాలో లీడ్ క్యారెక్టర్ ప్లే చేసిన అనీషా.. విమర్శకుల ప్రశంసలు పొందింది. కాగా ఈ మధ్య ‘దిల్ మంగ్డి’ సింగిల్ ద్వారా సింగర్‌గానూ పరిచయైన భామ.. త్వరలో ప్రొడ్యూసర్‌గానూ మారనుందని టాక్.