నిరుద్యోగులకు బిగ్ అలర్ట్.. డీఎస్సీ నోటిఫికేషన్ రద్దు

2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మెగా డీఎస్సీ ని విడుదల చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం నోటిఫికేషన్ విడుదలకు కసరత్తు చేస్తుంది.

Update: 2024-06-30 10:50 GMT

దిశ, వెబ్‌డెస్క్: 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మెగా డీఎస్సీ ని విడుదల చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం నోటిఫికేషన్ విడుదలకు కసరత్తు చేస్తుంది. ఈ క్రమంలో గత ప్రభుత్వం ఈ సంవత్సరం ఫిబ్రవరిలో 6,100 పోస్టులకు వేసిన డిఎస్సీ నోటిఫికేషన్ ను తాజా ప్రభుత్వం రద్దు చేసింది. ఈ మేరకు వైసీపీ ప్రభుత్వం జారీ చేసిన డిఎస్సీ నోటిఫికేషన్ ను రద్దు చేస్తున్నట్లు కూటమి ప్రభుత్వం 256 జీవోను విడుదల చేసింది. ఎన్నికల్లో నిరుద్యోగులకు ఇచ్చిన హామీ ప్రకారం సీఎంగా చంద్రబాబు నాయుడు తన మొదటి సంతకం మెగా డీఎస్సీ ఫైలుపై పెట్టగా.. నోటిఫికేషన్ విడుదలకు కసరత్తు జరుగుతుంది. ఈ క్రమంలోనే రెండు, మూడు రోజుల్లో 16,347 పోస్టులకు మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలకు ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. కాగా ఎన్నికల్లో విజయ అనంతరం మంత్రులుగా ప్రమాణం చేసిన వారితో సీఎం, డిప్యూటీ సీఎం ఆధ్వర్యంలో మొదటి కేబినెట్ బేటీ లో మెగా డిఎస్సీకి ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే.

Similar News