వలస బతుకులు ఆగం.. చెక్‌పోస్టు వద్ద మళ్ళీ అడ్డగింత

దిశ, నల్లగొండ: ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సరిహద్దు వాడపల్లి చెక్‌పోస్టు వద్ద మళ్ళీ ఉద్రిక్తత చోటుచేసుకుంది. కేంద్రం మార్గదర్శకాల మేరకు శనివారం స్వస్థలాలకు వెళ్లడానికి పలువురు వలస కూలీలు ఆంధ్రప్రదేశ్‌కు బయలుదేరారు. వాడపల్లి చెక్‌పోస్టు వద్దకు చేరుకోగానే ఏపీ పోలీసులు వారిని మళ్లీ అడ్డుకున్నారు. కాలినడకన, ద్విచక్ర వాహనాల మీద వెళ్లేవారికి ఎలాంటి అనుమతి పత్రాలు లేకపోవడంతో చెక్‌పోస్టు వద్ద నిలిపివేసశారు. దీంతో 100 మంది వలస కూలీలు సరిహద్దులోనే ఆగిపోయారు. అనుమతి పత్రాలు […]

Update: 2020-05-02 04:35 GMT

దిశ, నల్లగొండ: ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సరిహద్దు వాడపల్లి చెక్‌పోస్టు వద్ద మళ్ళీ ఉద్రిక్తత చోటుచేసుకుంది. కేంద్రం మార్గదర్శకాల మేరకు శనివారం స్వస్థలాలకు వెళ్లడానికి పలువురు వలస కూలీలు ఆంధ్రప్రదేశ్‌కు బయలుదేరారు. వాడపల్లి చెక్‌పోస్టు వద్దకు చేరుకోగానే ఏపీ పోలీసులు వారిని మళ్లీ అడ్డుకున్నారు. కాలినడకన, ద్విచక్ర వాహనాల మీద వెళ్లేవారికి ఎలాంటి అనుమతి పత్రాలు లేకపోవడంతో చెక్‌పోస్టు వద్ద నిలిపివేసశారు. దీంతో 100 మంది వలస కూలీలు సరిహద్దులోనే ఆగిపోయారు. అనుమతి పత్రాలు లేకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరిని అనుమతించేది లేదని పోలీసులు స్పష్టం చేశారు.

Tags: lockdown extended, vadapalli checkpost, andra telangana border,

Tags:    

Similar News