బుడమేరుకు వరద రావడానికి కారణం ఇదే.. వైవీ సుబ్బారెడ్డి సంచలన వ్యాఖ్యలు

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ శ్రేణులపై దాడులు జరుగుతున్నాయని వైసీపీ నేత ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఆరోపించారు.

Update: 2024-09-06 10:43 GMT

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ శ్రేణులపై దాడులు జరుగుతున్నాయని వైసీపీ నేత ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఆరోపించారు. వైసీపీ నేతలపై తప్పుడు కేసులు పెట్టి, అరెస్టు చేస్తూ భయాందోళనలకు గురి చేస్తున్నారని ఫైరయ్యారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయం పై దాడి కేసులో మాజీ ఎంపీ నందిగం సురేష్, వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డిని అరెస్ట్ చేయడాన్ని వైవీ సుబ్బారెడ్డి తీవ్రంగా ఖండించారు. అక్రమ అరెస్ట్‌లపై న్యాయపోరాటం చేస్తామని చెప్పారు.

సీఎం చంద్రబాబు ఇంటి పైకి వరద నీరు రాకుండా నీటిని మళ్లించడం వల్లే బుడమేరుకు వరద వచ్చిందని ఆయన ఆరోపించారు. దీనివల్ల విజయవాడ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని చెప్పారు. వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని అన్నారు. వరద నష్టాలు కప్పిపుచ్చుకునేందుకు వైసీపీ నేతలను అరెస్టులు చేయిస్తూ డైవర్షన్ పాలిటిక్స్ చేయిస్తోందని దుయ్యబట్టారు.


Similar News