AP News:వైసీపీ పార్లమెంటరీ నాయకుడిగా వైవీ సుబ్బారెడ్డి

ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో వైసీపీ ఊహించని ఓటమిని చవిచూసింది. ఈ ఎన్నికల ఫలితాల్లో వైసీపీ పార్టీకి కేవలం 11 స్థానాలే వచ్చాయి.

Update: 2024-06-14 12:39 GMT

దిశ,వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో వైసీపీ ఊహించని ఓటమిని చవిచూసింది. ఈ ఎన్నికల ఫలితాల్లో వైసీపీ పార్టీకి కేవలం 11 స్థానాలే వచ్చాయి. ఈ ఓటమిపై పలువురు వైసీపీ నేతలు డీలా పడిపోతున్నారని వారికి ధైర్యం చెప్పడానికి మాజీ సీఎం జగన్ ఈ రోజు(శుక్రవారం) సమావేశం ఏర్పాటు చేశారు. ఓటమి పట్ల అసహనంగా ఉన్న పార్టీ నేతలను పరామర్శించారు. ఈ సమావేశంలో వైసీపీ పార్లమెంటరీ నాయకుడిగా వైవీ సుబ్బారెడ్డి ఎన్నుకున్నట్లు వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రకటించారు. ఈ రోజు పార్టీ ఎంపీలతో నిర్వహించిన సమావేశంలో తన నిర్ణయాన్ని ప్రకటించారు. రాజ్యసభలో పార్టీ నాయకుడిగా మిథున్ రెడ్డి వ్యవహరిస్తారని వెల్లడించారు. పార్లమెంట్‌లో వైసీపీకి 11 మంది రాజ్యసభ సభ్యులు, నలుగురు లోక్‌సభ సభ్యులున్నారని, టీడీపీకి 16 మంది ఉన్నారని వివరించారు. ఈక్రమంలో ఓడిన చోటే మళ్లీ గెలిచి చూపిస్తామని వైఎస్ జగన్ ధీమా వ్యక్తం చేశారు.


Similar News