YV Subba Reddy: తిరుమలలో తొక్కిసలాట ప్రభుత్వ వైఫల్యమే.. వైవీ సుబ్బారెడ్డి సంచలన ఆరోపణలు
తిరుపతి (Tirupati)లో వైకుంఠ ద్వార దర్శన టోకెన్లు జారీ చేసే కేంద్రం వద్ద జరిగిన తొక్కిసలాట (Stampede) రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
దిశ, వెబ్‌డెస్క్: తిరుపతి (Tirupati)లో వైకుంఠ ద్వార దర్శన టోకెన్లు జారీ చేసే కేంద్రం వద్ద జరిగిన తొక్కిసలాట (Stampede) రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలోనే జరిగిన ఘటనపై టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి (YV Subba Reddy) ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు. తిరుపతి తొక్కిసలాట (Tirupati Stampede) ముమ్మాటికీ ప్రభుత్వ వైఫల్యమేనని ఆరోపించారు. టీటీడీ ఈవో (TTD EO), అధికారులు (Officers) సరైన ఏర్పాట్లు చేయకపోవడం వల్లే దుర్ఘటన జరిగిందని ఫైర్ అయ్యారు. అవసరమైన పోలీస్ ఫోర్స్ (Police Force)ను టోకెన్ల జారీ కేంద్రం వద్ద ఉపయోగించ లేదని కామెంట్ చేశారు. రాబోయే పది రోజుల్లో మళ్లీ ఇలాంటి ఘటనలు జరగకుండా ముందస్తు భద్రతా చర్యలు చేట్టాలని ఆయన డిమాండ్ చేశారు. భద్రతా ఏర్పాట్లు సరిగా చేసి ఉంటే ప్రాణాలు అమాయక భక్తులు ప్రాణాలు కోల్పోయేవారు కాదని వైవీ సుబ్బారెడ్డి అన్నారు.