YS Jagan vs Sharmila: వైఎస్ విజయమ్మ బహిరంగ లేఖపై వైసీపీ కౌంటర్ లెటర్

జగన్-షర్మిల వివాదం (YS Jagan vs Sharmila)పై వైఎస్ విజయమ్మ నిన్న (మంగళవారం) బహిరంగ లేఖ రాసిన విషయం తెలిసిందే.

Update: 2024-10-30 06:09 GMT

దిశ, వెబ్‌డెస్క్: జగన్-షర్మిల వివాదం (YS Jagan vs Sharmila)పై వైఎస్ విజయమ్మ నిన్న (మంగళవారం) బహిరంగ లేఖ రాసిన విషయం తెలిసిందే. అయితే ఈ లేఖకు ఈ రోజు (బుధవారం) వైసీపీ (YCP) కూడా ఎక్స్ వేదికగా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. దివంగత మహానేత వైయస్సార్‌ (YSR) భార్యగా, వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, మాజీ సీఎం జగన్మోహన్‌రెడ్డి తల్లిగా విజయమ్మగారిని తాము గౌరవిస్తామని, అయితే ఆమె విడుదల చేసిన బహిరంగ లేఖ ద్వారా ఆమె షర్మిల (Sharmila) ఒత్తిడికి లొంగిపోయారని అర్థమవుతోందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే కొన్ని అంశాలను ఆమె ముందుకు, ప్రజల ముందుకు తీసుకువస్తున్నామంటూ రాసుకొచ్చారు. విజయమ్మ (YS Vijayamma) తన లేఖలో జగన్ (YS Jaganmohanreddy) బెయిల్ రద్దు కుట్రను ప్రస్తావించకపోవడం చూస్తుంటే ఇది వివాదాన్ని పట్టించడానికి చేస్తున్న ప్రయత్నంగానే కనిపిస్తోందని పేర్కొన్నారు. ‘ఇది ముమ్మాటికీ చంద్రబాబుకు మేలు చేయడమే. ఇది విజయమ్మగారికి ధర్మమేనా..? ఇద్దరు బిడ్డల మధ్య తటస్థంగా ఉండాల్సింది పోయి ఆమె ఇలా పక్షపాతంగా వ్యవహరించడం బాధాకరం. విజయమ్మ వ్యవహారంతో వైఎస్సార్ అభిమానులు కలత చెందారు. బాధపడుతున్నారు’’ అంటూ రాసుకొచ్చారు.


Similar News