Mega DSC:మెగా డీఎస్సీ పై ప్రభుత్వం కీలక నిర్ణయం.. నోటిఫికేషన్ ఎప్పుడంటే?

ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం(AP Government) ఉద్యోగాల భర్తీపై ప్రత్యేక ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది.

Update: 2024-10-30 08:05 GMT
Mega DSC:మెగా డీఎస్సీ పై ప్రభుత్వం కీలక నిర్ణయం.. నోటిఫికేషన్ ఎప్పుడంటే?
  • whatsapp icon

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం(AP Government) ఉద్యోగాల భర్తీపై ప్రత్యేక ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు(CM Chandrababu) ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎన్డీయే కూటమి మరో ఎన్నికల హామీ దిశగా అడుగులు వేస్తుంది. ఎన్డీయే కూటమి అధికారంలోకి వస్తే మెగా డీఎస్సీ నోటిఫికేషన్(Mega DSC Notification) పైన తొలి సంతకం చేస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇచ్చిన హామీ మేరకు మొదటి సంతకం ఆ ఫైల్ మీదనే చేయడం జరిగింది. ఇప్పటికే మెగా డీఎస్సీ(Mega DSC) నిర్వహణపై ప్రభుత్వం(Government) కసరత్తు చేస్తోంది.

అందులో భాగంగా డీఎస్సీ నిర్వహణ(Management of DSC), పోస్టుల భర్తీపై చంద్రబాబు సర్కార్ తాజాగా కీలక ప్రకటన చేసింది. మెగా డీఎస్సీ నోటిఫికేషన్ జారీ కోసం ముహూర్తం ఫిక్స్ చేసింది. రాష్ట్రంలో 16,347 పోస్టులతో నవంబర్ 6వ తేదీన మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో మూడు నుంచి నాలుగు నెలల్లో నియామక ప్రక్రియ పూర్తి చేసి, వచ్చే విద్యా సంవత్సరానికి పోస్టింగులు(Postings for the academic year) ఇచ్చేలా ప్రణాళిక సిద్ధం చేసింది. ఇప్పటికే జిల్లాల వారీగా ఖాళీలు, రోస్టర్ పాయింట్లు(Roster points), సమాంతర రిజర్వేషన్ల(Parallel reservations) వివరాలను డీఈవో(DEO)ల నుంచి సేకరించింది. మరోవైపు టెట్ తుది కీ నిన్న విడుదలైన విషయం తెలిసిందే. ఇక నవంబర్ 2వ తేదీన టెట్ ఫలితాలు(TET Results) వెల్లడి కానున్నాయి.

Tags:    

Similar News