ఇంటర్ విద్యార్థినిపై పెట్రోల్ దాడి.. యువకుడు అరెస్ట్

కడప జిల్లా బద్వేలు సమీపంలో ఇంటర్ విద్యార్థినిపై పెట్రోల్ దాడికి పాల్పడిన యువకుడు విగ్నేశ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ...

Update: 2024-10-19 16:26 GMT

దిశ, వెబ్ డెస్క్: కడప జిల్లా బద్వేలు సమీపంలో ఇంటర్ విద్యార్థినిపై పెట్రోల్ దాడికి పాల్పడిన యువకుడు విగ్నేశ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఘటనకు ప్రేమ వ్యవహారమే కారణమని భావిస్తున్నారు. ఈ మేరకు కేసు విచారణ జరుపుతున్నారు. కాగా బద్వేలు రామాంజనేయనగర్‌కు చెందిన విద్యార్థిని, విగ్నేశ్ చిన్నపటి నుంచి స్నేహితులు. ఈ క్రమంలోనే తనతో మాట్లాడాలని, రోడ్డు పక్కన ఉన్న చెట్ల పొదల్లోకి రావాలని, లేనిపక్షంలో చచ్చిపోతానని విగ్నేశ్ బెదిరించడంతో విద్యార్థినిని అక్కడికి వెళ్లింది. దీంతో వెంట తెచ్చుకున్న పెట్రోల్‌ను విద్యార్థినిపై పోసి నిప్పంటించారు. అనంతరం అక్కడి నుంచి విగ్నేశ్ పారిపోయాడు.

అయితే ఈ దాడిలో తీవ్ర గాయాలు కావడంతో విద్యార్థినిని కేకలు వేశారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విద్యార్థినిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలించారు. బృందాలు విడిపోయి గాలించిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.


Similar News