‘పేదలకు వరం సీఎం రిలీఫ్‌ ఫండ్‌’.. మంత్రి రాంప్రసాద్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

సీఎం రిలీఫ్‌ ఫండ్‌ నిరుపేదలకు వరం లాంటిదని, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు.

Update: 2025-03-13 13:40 GMT
‘పేదలకు వరం సీఎం రిలీఫ్‌ ఫండ్‌’.. మంత్రి రాంప్రసాద్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
  • whatsapp icon

దిశ, రాయచోటి: సీఎం రిలీఫ్‌ ఫండ్‌ నిరుపేదలకు వరం లాంటిదని, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం రాయచోటి పట్టణంలోని తమ క్యాంపు కార్యాలయం నందు మంత్రి రాంప్రసాద్ రెడ్డి సీఎం రిలీఫ్ ఫండ్ కింద మంజూరైన ఎల్ వో సి పత్రాలను మరియు చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పేద ప్రజల ఆరోగ్యానికి రాష్ట్ర ప్రభుత్వం కొండంత భరోసానిస్తోందన్నారు. పేదల ఆరోగ్య సమస్యలను పరిష్కరించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ ప్రజల వెన్నంటి ఉంటుందన్నారు.

రాష్ట్ర ప్రజల సంక్షేమం గురించి ఆలోచించే సీఎం చంద్రబాబు కలకాలం ముఖ్యమంత్రిగా ఉండాలని ప్రజలందరూ ఆయనను దీవించాలన్నారు. ఈ సందర్భంగా పాకాల రవిచంద్ర 449034 రూపాయలు, పెద్ద పుత్త అన్నయ్య 120389, రూపాయలు, పందిపోటు సుబ్బమ్మ 81757 రూపాయలు, గండిపల్లి ప్రభావతి 45600 రూపాయలు, కే లక్ష్మమ్మ 43972 రూపాయలు, మన చంద్రశేఖర్ 120430 రూపాయలు, సోమల రాజు 100191 రూపాయలు, నాన్నకు శివయ్య 38700 రూపాయలు, సయ్యద్ షేక్ కిరణ్ 43795 రూపాయలు, నర్రి మల్లికార్జున నాయుడు 43911 రూపాయలు, కొండవీటి వాసుదేవ నాయుడు 78513 రూపాయలు, బస్సు రెడ్డి మంజునాథ రెడ్డి 59883 రూపాయలు, రాగి నూతల మల్లికార్జున 80519 రూపాయలు, ఆర్ల మల్లికార్జున 20000 రూపాయలు, బి. రేవతి 61920 రూపాయలు, బి విజయ్ కుమార్ 75090 రూపాయలు, టి శ్రీనివాసులు 175000 రూపాయలు, సి రామదాసు నాయుడు 107205 రూపాయలు, ఎ. పార్వతమ్మ 259914 రూపాయలు, పి శ్రీనివాసులు రెడ్డి 250000 రూపాయలను ఎల్వోసీ పత్రాలను లబ్ధిదారులకు అందజేశారు.

Read Also..

అసంపూర్తి గృహ నిర్మాణాలు పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్ 


Similar News