కాశినాయనలో అన్నదాన సత్రం కూల్చివేత.. మంత్రి లోకేశ్ క్షమాపణలు

కడప జిల్లా కాశీనాయనలో అన్నదాన సత్రం కూల్చేవేతపై మంత్రి లోకేశ్ క్షమాపణలు చెప్పారు..

Update: 2025-03-12 03:46 GMT
కాశినాయనలో అన్నదాన సత్రం కూల్చివేత.. మంత్రి లోకేశ్ క్షమాపణలు
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్: కడప జిల్లా(Kadapa District) బద్వేలు నియోజకవర్గం నల్లమలలోని శ్రీ కాశినాయన(Sri Kasi Nayana) మండలం కేంద్రంలో అవధూత కాశిరెడ్డి నాయన పరమపదించారు. అంతేకాదు ఇక్కడ పురాతన లక్ష్మీనరసింహ స్వామి దేవాలయం(Lakshmi Narasimha Swamy Temple) కూడా ఉంది. అయితే ఇవి టైగర్ జోన్ రిజర్వ్ ఫారెస్ట్(Tiger Zone Reserve Forest) పరిధిలోకి వస్తాయని ఉన్నట్టుండి అధికారులు కొన్ని భవనాలను కూల్చివేశారు.

అయితే విషయం తెలుసుకున్న మంత్రి నారా లోకేశ్(Minister Nara Lokesh) తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అటవీ భూములు, టైగర్ జోన్ నిబంధనల కారణంగా కాశీనాయన ఆశ్రమం అన్నదాన సత్రాన్ని కూల్చివేయడం బాధాకరమన్నారు. అటవీ నిబంధనలు ఉన్నా, భక్తుల మనోభావాలు గౌరవించి, అన్నదాన కార్యక్రమాలు జరిగే భవనాలను కూల్చకుండా ఉండాల్సిందన్నారు. ఈ కూల్చివేతలకు ప్రభుత్వం తరఫున తాను క్షమాపణ చెబుతున్నానని తెలిపారు. కూల్చివేతకు పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు. త్వరలో తన సొంత నిధులతో అదే చోట అన్నదాన సత్రం పునర్నిర్మిస్తానని మంత్రి లోకేశ్ ట్వీట్ చేశారు.

Tags:    

Similar News