AP News:మాజీ సీఎం జగన్‌తో ఆస్తి వివాదం వేళ.. వైఎస్ షర్మిల సంచలన లేఖ

ఏపీ మాజీ సీఎం జగన్‌పై ఏపీపీసీసీ అధ్యక్షురాలు(APPCC) వైఎస్ షర్మిల(YS Sharmila) మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-10-25 08:34 GMT

దిశ,వెబ్‌డెస్క్: ఏపీ మాజీ సీఎం జగన్‌పై ఏపీపీసీసీ అధ్యక్షురాలు(APPCC) వైఎస్ షర్మిల(YS Sharmila) మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల రాష్ట్రంలో వైఎస్ జగన్(YS Jagan), షర్మిల మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా వైఎస్ షర్మిల వైఎస్సార్(YSR) అభిమానులకు 3 పేజీల బహిరంగ లేఖ రాశారు.

‘‘YSR అభిమానులకు వాస్తవాలు తెలియజేయాల్సిన అవసరం ఉంది. అమ్మ వైఎస్ విజయమ్మ గారు, నాన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి(Rajasekhar Reddy) గారి గురించి ఒక పుస్తకం రాశారు. అందులో నాన్న గురించి ప్రత్యేకంగా ఒక మాట రాశారు. ‘రాజశేఖర్ రెడ్డి గారికి లోకం అంతా ఒకెత్తయితే’, తన బిడ్డ షర్మిల ఒకెత్తు అని రాశారు. నాన్నకు నేనంటే ప్రాణం. నాన్న నన్ను ఎప్పుడూ ఆడపిల్ల కదా అని చిన్న చేసో, తక్కువ చేసో చూడలేదు. నాన్న బ్రతికి ఉన్నన్ని రోజులు ఒకే మాట అనేవారు. "నా నలుగురు గ్రాండ్ చిల్డ్రన్ నాకు సమానం". వైఎస్ఆర్ గారు బ్రతికి ఉండగా స్థాపించిన అన్ని కుటుంబ వ్యాపారాల్లో, నలుగురు గ్రాండ్ చిల్డ్రన్‌కి(Grand children) సమాన వాటా ఉండాలి. రాజశేఖర్ రెడ్డి గారు ఉండగా స్థాపించిన అన్ని వ్యాపారాలు కుటుంబ వ్యాపారాలే. అవి జగన్ మోహన్ రెడ్డి గారి సొంతం కాదు. ఉన్న అన్ని కుటుంబ వ్యాపారాలకు జగన్ గారు "గార్డియన్ " మాత్రమే. అన్ని వ్యాపారాలు నలుగురు చిన్న బిడ్డలకు సమానంగా పంచి పెట్టలనేది జగన్ మోహన్ రెడ్డి గారి బాధ్యత. ఇది రాజశేఖర్ రెడ్డి గారి మేండేట్. వైఎస్ఆర్ ఈ ఉద్దేశ్యాన్ని ఆయన బిడ్డలమైన మాకు, ఆయన భార్యకు, సన్నిహితులందరికీ స్పష్టంగా తెలిసిన విషయం’’ అని లేఖలో వైఎస్ షర్మిల పేర్కొన్నారు.

Tags:    

Similar News