YS. Sharmila: స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై వైఎస్. షర్మిల కీలక డిమాండ్

విశాఖ స్టీల్ ప్లాంట్(Visakhapatnam Steel Plant) ప్రైవేటీకరణ(Privatization) లేదని స్పష్టమైన ప్రకటన చేశాకే(Clear Statement) ప్రధాని నరేంద్ర మోడీ(Prime Minister Narendra Modi) విశాఖలో అడుగు పెట్టాలని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్.షర్మిల(YS Sharmila) కీలక డిమాండ్ చేశారు.

Update: 2025-01-04 08:23 GMT

దిశ, వెబ్ డెస్క్ : విశాఖ స్టీల్ ప్లాంట్(Visakhapatnam Steel Plant) ప్రైవేటీకరణ(Privatization) లేదని స్పష్టమైన ప్రకటన చేశాకే(Clear Statement) ప్రధాని నరేంద్ర మోడీ(Prime Minister Narendra Modi) విశాఖలో అడుగు పెట్టాలని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్.షర్మిల(YS Sharmila) కీలక డిమాండ్ చేశారు. ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కుతో కేంద్ర ప్రభుత్వం ఇంకా చెలగాటం ఆడుతూనే ఉందని..ప్లాంట్‌ను ప్రైవేట్ పరం చేసే కుట్రలకు ఆజ్యం పోస్తూనే ఉందని ఆరోపించారు. ఈనెల 8న విశాఖ పర్యటనకు వస్తున్న ప్రధాని మోడీని, రాష్ట్రంలోని కూటమి పార్టీలను ఏపీ కాంగ్రెస్ పక్షాన డిమాండ్ చేస్తున్నామని.. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ లేదని కేంద్ర ప్రభుత్వం తక్షణమే క్లారిటీ ఇవ్వాలన్నారు.

స్టీల్ ప్లాంట్ ను సెయిల్(SAIL)లో విలీనం చేస్తున్నట్లు అధికారిక ప్రకటన వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఆర్థికంగా స్టీల్ ప్లాంట్ కష్టాలను గట్టెక్కించేందుకు సుమారు రూ.20వేల కోట్ల ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని, భవిష్యత్‌లో స్టీల్ ప్లాంట్‌కు ఇబ్బంది రాకుండా ప్రత్యేకంగా సొంత గనులను కేటాయించాలని కోరారు. ప్లాంట్‌కున్న 7 మిలియన్ టన్నుల సామర్ధ్యం మేరకు పూర్తి స్థాయిలో స్టీల్ ఉత్పత్తి చేయాలని, 1400 రోజులుగా ఆందోళనలు చేస్తున్న కార్మికుల డిమాండ్లపై యాజమాన్యంతో స్పష్టత ఇప్పించాలని డిమాండ్ చేశారు. కార్మిక సంఘాలు అడుగుతున్నట్లు 3 ఏళ్ల పాటు స్టీల్ ప్లాంట్‌కి ట్యాక్స్ హాలీడే ఇవ్వాలని షర్మిల డిమాండ్ చేశారు.

Tags:    

Similar News