జగన్ రెడ్డి క్రిస్టియన్ అయ్యుండి మణిపూర్ అల్లర్లపై ఎందుకు స్పందించలేదు: వైఎస్ షర్మిల

ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన షర్మిలను అధిష్టానం ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ గా నియమించింది.

Update: 2024-01-21 12:32 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన షర్మిలను అధిష్టానం ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ గా నియమించింది. ఆ బాధ్యతలు తీసుకున్న తర్వాత రాష్ట్రానికి చేరుకున్న షర్మిల వచ్చి రాగానే తన సొంత అన్న అయిన వైఎస్ జగన్ వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. రాష్ట్రంలో భూతద్దం పెట్టి వెతికినా అభివృద్ధి కనపిస్తలేదని.. రాష్ట్రాన్ని పూర్తిగా అప్పు పాలు చేశాడని విమర్శించింది. రాష్ట్రంలో వైసీపీకి, టీడీపీకి, బీజేపీ పార్టీలకు పొత్తు ఉందని తేల్చి చెప్పారు. జగన్ రెడ్డి ఓ క్రైస్తవుడు అయ్యుండి మణిపూర్ లో క్రిస్టియన్‌‌ల మీద జరుగుతున్న దాడులపై ఎందుకు స్పందించలేదని షర్మిళ ప్రశ్నించారు. మణిపూర్ అల్లర్లలో 2000 చర్చిల మీద, 60 వేల మంది దాడి జరగ్గా వారంతా నిరాశ్రయులు అయినా కూడా సీఎం హోదాలో ఉన్న క్రైస్తవుడైన జగన్ రెడ్డి ఎందుకు స్పందించలేదని ఇలా చేస్తే క్రైస్లవులకు కోపం రాదా..? వారు మనుసులు కారా అంటూ వైఎస్ షర్మిల ప్రశ్నించారు. 


Similar News