Breaking: శత్రృవుకి శత్రువు మిత్రుడే అంటున్న వైసీపీ.. కారణం ఇదే

రానున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రసవత్తరంగా మారాయి.

Update: 2024-02-26 11:52 GMT

దిశ డైనమిక్ బ్యూరో: రానున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. టీడీపీ జనసేన పొత్తులో భాగంగా రెండు రోజుల క్రితం అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. విడుదలైన జాబితా పై ఇరు పార్టీ నేతలు అసంతృప్తితో ఉన్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాల్లో ఇరు పార్టీల నేతలు మరో పార్టీకి మకాం మార్చే అవకాశం ఉందనే చర్చ రాజకీయవర్గాల్లో జోరుగా సాగుతోంది.

అయితే శత్రృవుకి శత్రువు మిత్రుడే అనే ధోరణితో వైసీపీ అడుగులేస్తోంది. అసంతృప్తవాదులతో వైసీపీ భేటీ అయ్యి తమకు మద్దతు ఇవ్వాల్సిందిగా కోరుతున్నట్లు సమాచారం. కాగా ఇదే విషయాన్ని తెలియచేస్తూ.. టీడీపీ, జనసేన అధినేతలు స్పందించాలంటూ అసంతృప్తవాదులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.  ఇప్పటికే కోనసీమ జిల్లా లోని కొత్త పేట నియోజకవర్గం లో జనసేన ఇంచార్జ్ బండారు శ్రీనివాస్ కి పార్టీ టికెట్ దక్కలేదు.

దీనితో అసహనానికి గురైన ఆయన అసంతృప్తితో ఉన్నారు. దీనితో నిన్న తన క్యాడర్ అంతా కలిసి నిరసన చేపట్టారు. పార్టీ కార్యాలయంలోని జెండాలను, ఫ్లెక్సీలను పీకిపారేసి.. వాటిని దగ్ధం చేసారు. ఈ నేపథ్యంలో బండారు శ్రీనివాస్ తో స్థానిక వైసీపీ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి భేటీ అయ్యారు. జనసేన అభ్యర్థిని వైసీపీ అభ్యర్థి కలవడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక ఈ సమావేశంలో తనకు మద్దతు ఇవ్వాల్సిందిగా శ్రీనివాస్ ను జగ్గిరెడ్డి కోరడం జరిగిందని సమాచారం.

ఈ నేపథ్యంలో టీడీపీ, జనసేన పార్టీల్లో చోటు చేసుకుంటున్న మార్పులు రానున్న ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. మరి ఈ అంశంపై ఇరుపార్టీల అధినేతలు ఎలా స్పంధిస్తారో వేచి చూడాలి. 

Read More..

సీఎం జగన్ సంచలన నిర్ణయం.. 2200 మంది నాయకులతో రేపు ఇంటరాక్ట్  

Tags:    

Similar News