YSRCP:బాధిత కుటుంబానికి రూ.10 లక్షల చెక్కు అందించిన వైసీపీ

గుంటూరు జిల్లా తెనాలికి చెందిన స‌హానా అనే యువతి గత నెల(అక్టోబర్‌)లో నవీన్ అనే రౌడీషీట‌ర్ పాశవిక దాడిలో తీవ్రంగా గాయ‌ప‌డి మృతి చెందిన విష‌యం తెలిసిందే.

Update: 2024-11-03 14:46 GMT

దిశ,వెబ్‌డెస్క్: గుంటూరు జిల్లా తెనాలికి చెందిన స‌హానా అనే యువతి గత నెల(అక్టోబర్‌)లో నవీన్ అనే రౌడీషీట‌ర్ పాశవిక దాడిలో తీవ్రంగా గాయ‌ప‌డి మృతి చెందిన విష‌యం తెలిసిందే. బ్రెయిన్ డెడ్‌తో చనిపోయిన సహానా కుటుంబానికి వైసీపీ నాయకత్వం రూ.10 లక్షల ఆర్థిక సాయాన్ని అందించింది. వివరాల్లోకి వెళితే.. మాజీ సీఎం జగన్(YS Jagan) మృతురాలి కుటుంబ స‌భ్యుల‌ను ప‌రామ‌ర్శించి ధైర్యం చెప్పారు. పార్టీ త‌ర‌ఫున ఆదుకుంటామ‌ని హామీ ఇచ్చారు. రూ.10 ల‌క్ష‌లు ఆర్థిక సాయం చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా వైసీపీ నేత అంబటి రాంబాబు, తెనాలి మాజీ ఎమ్మెల్యే శివకుమార్, పార్టీ నేతలు అంబటి మురళి, ఇతర నాయకులు ఈ రోజు(ఆదివారం) సహానా ఇంటికి వెళ్లి పరిహారం చెక్‌ను కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ విషయాన్ని ట్విట్టర్(Twitter) వేదికగా వైసీపీ వెల్లడించింది. సహానా కుటుంబాన్ని మాజీ సీఎం జగన్ ఇటీవల పరామర్శించారని, పార్టీ తరఫున రూ.10 లక్షలు ఆర్థిక సాయం ప్రకటించారని పార్టీ ట్విట్టర్ వేదికగా పేర్కొంది.

Tags:    

Similar News