వైసీపీకి బిగ్ షాక్.. షర్మిల సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన MLA

ఎన్నికల దగ్గరపడుతున్న వేళ అధికార వైసీపీకి మరో బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీకి పూతలపట్టు నియోజకవర్గ ఎమ్మెల్యే ఎంఎస్ బాబు గుడ్ బై చెప్పారు.

Update: 2024-04-06 05:25 GMT
వైసీపీకి బిగ్ షాక్.. షర్మిల సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన MLA
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: ఎన్నికల దగ్గరపడుతున్న వేళ అధికార వైసీపీకి మరో బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీకి పూతలపట్టు నియోజకవర్గ ఎమ్మెల్యే ఎంఎస్ బాబు గుడ్ బై చెప్పారు. శనివారం ఉదయం వైఎస్ షర్మిల సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. ఆయనకు షర్మిల కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అయితే, సీఎం జగన్ పూతపట్టు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా మూతిరేకుల సునీల్ కుమార్ ఖరారు చేశారు. సిట్టింగ్ ఎమ్మెల్యేను అయిన తనను కాదని.. మరో వ్యక్తికి టికెట్ కేటాయించడంతో బాబు అసంతృప్తితో ఉన్నారు. పార్టీ మార్పులు వార్తలు వచ్చినా.. ఇంతకాలం సైలెంట్‌గా ఉన్నారు. తాజాగా ఇవాళ షర్మిల హామీ మేరకు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.

Tags:    

Similar News