పవన్ కల్యాణ్ బలం ఎంతో తెలిసిపోయింది.. ముద్రగడ కీలక వ్యాఖ్యలు
కాపు నేత ముద్రగడ పద్మనాభం కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీలో చేరిన తర్వాత మొదటిసారిగా ఇవాళ మీడియా ముందుకు వచ్చారు.
దిశ, వెబ్‌డెస్క్: కాపు నేత ముద్రగడ పద్మనాభం కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీలో చేరిన తర్వాత మొదటిసారిగా ఇవాళ మీడియా ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను ఏమీ ఆశించి వైసీపీలో చేరలేదు అని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రయోజనాలే తనకు ముఖ్యమని తెలిపారు. రాష్ట్ర ప్రజలు ఆర్థికంగా బలోపేతం కావాలి.. కాపులు ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నట్లు వెల్లడించారు. పవన్ కల్యాణ్‌కు ఇంకా రాజకీయం తెలియడం లేదని ఎద్దేవా చేశారు.
ఇచ్చిన 21 సీట్లు కూడా తిరిగి టీడీపీకి ఇచ్చేస్తే బెటర్ అని సెటైర్ వేశారు. పవన్‌ను మారుద్దామని ఎంత ప్రయత్నించినా రాలేదని చెప్పారు. రాజకీయాల్లో సినిమా వాళ్లను ప్రజలు నమ్మరు అని అన్నారు. మొన్న ఎన్నికల్లో రెండు చోట్లా ఓడిపోవడం, ఇప్పుడు 21 స్థానాలకు పరిమితం కావడంతో పవన్ బలం ఏంటో ప్రజలకు తెలిసిపోయిందని అన్నారు. 21 సీట్లలో పవన్ కల్యాణ్ ఎన్ని గెలవగలడో కూడా తెలియదని ఎద్దేవా చేశారు. ఎన్నికల తర్వాత జనసేన పార్టీ క్లోజ్ అవ్వడం ఖాయమని కీలక వ్యాఖ్యలు చేశారు.