Breaking News: సీఎం జగన్‌కు రుణపడి ఉంటా.. వైసీపీ ఇంచార్జ్‌ పిరియా విజయ

వైసీపీ అధిష్టానం ఇచ్చాపురం నియోజకవర్గం వైసీపీ ఇంచార్జ్‌ గా పిరియా విజయను నియమించిన విషయం అందరికి సుపరిచితమే.

Update: 2024-01-13 09:12 GMT

దిశ వెబ్ డెస్క్:  వైసీపీలో చోటు చేసుకుంటున్న మార్పులు చేర్పుల నేపథ్యంలో వైసీపీ అధిష్టానం ఇచ్చాపురం నియోజకవర్గం వైసీపీ ఇంచార్జ్‌ గా పిరియా విజయను నియమించిన విషయం అందరికి సుపరిచితమే. కాగా తాజాగా ఆమె శ్రీకాకుళంలో మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇచ్చాపురం ఇంచార్జ్‌ గా తనకు అవకాశం ఇచ్చినందుకు ఎప్పటికి ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ కి రుణపడి ఉంటాను అని ఆమె హర్షం వ్యక్తం చేశారు. ఇక సర్వే రిపోర్ట్ ఆధారంగానే తనకు ఇంచార్జ్ భాద్యతలు అప్పగించారని.. ఒక బీసీ మహిళైన తనకు జగన్ అవకాశం ఇవ్వడం ఆనందంగా ఉందని తెలిపారు.

ఇక వైసీపీ ప్రభుత్వ పరిపాలనలో ప్రజలు చాల సంతోషంగా ఉన్నారని.. రెండున్నరేళ్లు కరోనా ప్రపంచవ్యాప్తంగా విలయ తడవం చేసిందని.. అయిన అలాంటి గడ్డు పరిస్థితి లోనూ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి బాటలోనే సాగిందని పేర్కొన్నారు. టీడీపీ హయాంలో అభివృద్ది, సంక్షేమం ఏమీలేదని ఆరోపించిన ఆమె.. జగన్ ప్రభుత్వ పరిపాలనలో జగనన్న సంక్షేమం అందని ఊరు, గ్రామం లేదని పేర్కొన్నారు.

ఇక టీడీపీ హయాంలో ప్రజలు డయాలసిస్ చేయించుకునేందకు కనీస సౌకర్యాలు లేవని.. గతంలో ఉద్దానంలో ఎంతోమంది కిడ్నీ రోగులు చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఉద్దానంను పూర్తిస్థాయిలో ఆదుకున్న వ్యక్తి సీఎం వైఎస్‌ జగన్‌ మాత్రమే అని పేర్కొన్నారు. అలానే కిడ్నీ రోగులకు పెన్షన్లు పెంచి.. రీసెర్చ్ ఆస్పత్రి కట్టించారని.. అలానే 805 గ్రామాలకు త్రాగునీటికి కోసం 700 కోట్ల రూపాయలతో ఉద్దానం డ్రింకింగ్ వాటర్ స్కిం తీసుకు వచ్చిన వ్యక్తి జగన్ అని వైసీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ పైన ప్రశంసల జల్లు కురిపించారు. 

Tags:    

Similar News