నందిగం సురేశ్‌తో ములాఖత్.. గుంటూరు సబ్ జైలుకు జగన్
మాజీ ఎంపీ నందిగం సురేశ్‌ను వైసీపీ అధినేత జగన్ గుంటూరు జిల్లా జైలులో పరామర్శించనున్నారు...
దిశ, వెబ్ డెస్క్: మంగళగిరి తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంపై దాడి చేసిన కేసులో వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్‌ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించిన విషయం తెలిసిందే. అయితే ఆయనను మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ పరామర్శించనున్నారు. ప్రస్తుతం గుంటూరు జైల్లో ఉన్న సురేశ్‌ను కలవనున్నారు. ఈ మేరకు ములాఖత్ తీసుకున్నారు. కాసేపట్లో జైలు వద్దకు జగన్ వెళ్లనున్నారు. ఇప్పటికే నందిగం సురేశ్ అరెస్ట్‌ను జగన్ ఖండించారు. రాజకీయ కక్ష సాధింపుల్లో భాగంగా నందిగంపై కేసు నమోదు చేశారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో గుంటూరు జిల్లా జైలు వద్దకు వైసీపీ నాయకులు భారీగా చేరుకునే అవకాశం ఉంది. దీంతో పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు.