వైసీపీకి త్వరలో రాజీనామా చేస్తా.. ఎమ్మెల్సీ రామచంద్రయ్య సంచలన వ్యాఖ్యలు

వైసీపీలో రాజకీయంగా ప్రజాస్వామం కనిపించలేదని, త్వరలో ఎమ్మెల్సీ పదవికి రాజీనామ చేసి, ఆ పార్టీని వీడనున్నట్లు ఎమ్మెల్సీ రామచంద్ర కీలక వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-01-07 08:05 GMT

దిశ, వెబ్‌డెస్క్: వైసీపీలో రాజకీయంగా ప్రజాస్వామం కనిపించలేదని, త్వరలో ఎమ్మెల్సీ పదవికి రాజీనామ చేసి, ఆ పార్టీని వీడనున్నట్లు ఎమ్మెల్సీ రామచంద్ర కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజా ధనాన్ని కోర్టులో కేసుల కోసం ఖర్చు పెడుతున్నారని ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రూ.12 లక్షల కోట్ల అప్పులు చేశారని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వానికి ఆదాయం వచ్చే సెక్టార్లు పూర్తిగా దెబ్బతిన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యక్తిగత కేసుల కోసం కేంద్రంతో లాలూచి పడి రాష్ట్రానికి రావాల్సిన అనేక ప్రాజెక్టులను వదులుకున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం చేపడుతున్న సాధికారత యాత్ర వల్ల ఎలాంటి ప్రయోజనం ఆయన ఉండదన్నారు.   

Tags:    

Similar News