వైసీపీ కార్యకర్త దారుణ హత్య..పల్నాడు ఎస్పీ ఏమన్నారంటే?
నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే ఓ యువకుడిని మరో యువకుడు దారుణంగా హత్య చేసిన ఘటన బుధవారం పల్నాడు జిల్లాలోని వినుకొండలోని ముళ్లమూరు బస్టాండ్ సెంటర్‌లో చోటుచేసుకుంది.
దిశ,వెబ్‌డెస్క్:నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే ఓ యువకుడిని మరో యువకుడు దారుణంగా హత్య చేసిన ఘటన బుధవారం పల్నాడు జిల్లాలోని వినుకొండలోని ముళ్లమూరు బస్టాండ్ సెంటర్‌లో చోటుచేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టగా సంచలన విషయాలు బయటపడ్డాయి. వినుకొండలో వైసీపీ కార్యకర్త రషీద్ హత్యలో ఎలాంటి రాజకీయ కోణం లేదని పల్నాడు ఎస్పీ శ్రీనివాస్ రావు తెలిపారు. మృతుడు రషీద్, నిందితుడు జిలానీ మధ్య కొంతకాలం నుంచి వివాదం ఉందని ఆయన వెల్లడించారు. ఈక్రమంలో వ్యక్తిగత కక్షతోనే హత్య జరిగిందని ఎస్పీ వివరించారు. ఈ నేపథ్యంలో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఉండేందుకు వినుకొండలో 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు చెప్పారు.