‘పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏ దీక్ష చేస్తారు?’.. తొక్కిసలాట ఘటన పై మాజీ మంత్రి ఆగ్రహం

తిరుమల(Tirumala)లో వైకుంఠ ఏకాదశి సర్వదర్శన టోకెన్ల జారీలో జరిగిన తొక్కిసలాట (Stampede)లో ఆరుగురు భక్తులు ప్రాణాలు కోల్పోగా.. పలువురు గాయపడిన సంగతి తెలిసిందే.

Update: 2025-01-09 12:54 GMT

దిశ,వెబ్‌డెస్క్: తిరుమల(Tirumala)లో వైకుంఠ ఏకాదశి సర్వదర్శన టోకెన్ల జారీలో జరిగిన తొక్కిసలాట (Stampede)లో ఆరుగురు భక్తులు ప్రాణాలు కోల్పోగా.. పలువురు గాయపడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై తాజాగా వైసీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్(Former Minister Gudivada Amarnath) తీవ్రంగా స్పందించారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ.. తిరుపతి చరిత్రలో ఎప్పుడూ జరగని దుర్ఘటన చోటుచేసుకోవడం బాధాకరమని అన్నారు. ఈ ఘటనకు ప్రభుత్వమే(AP Government) బాధ్యత వహించాలని, మృతుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

లడ్డూ విషయంలో ప్రాయశ్చిత్త దీక్ష చేసిన పవన్ కళ్యాణ్(AP Deputy CM Pawan Kalyan) ఇప్పుడు తిరుపతి ఘటన పై ఎలాంటి దీక్షలు చేస్తారని ఆయన ప్రశ్నించారు. ఈ పాపాన్ని ఎలా సరిదిద్దుకుంటారని నిలదీశారు. సనాతన ధర్మాన్ని కాపాడే నాయకుడు పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏం చెబుతారని.. గతంలో సనాతన ధర్మ దీక్షను చేసిన పవన్.. ఇప్పుడు ఏ దీక్ష చేస్తారో చూస్తామని అమర్నాథ్ వ్యాఖ్యానించారు. నిన్న ప్రధాని మోడీ భజన మానేసి.. తిరుపతి(Tirupathi)లో భక్తుల సౌకర్యాల మీద దృష్టి సారించి ఉంటే ఇన్ని ప్రాణాలు పోయేవి కాదని మాజీ మంత్రి అమర్నాథ్ అన్నారు. ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మృతుల కుటుంబాలకు వైసీపీ(YCP) తరఫున ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నామన్నారు.

Full View

( Video Credit to YSR Congress Party - YSRCP Facebook )

Tags:    

Similar News