ఈసీ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారా..? ఎలాంటి కేసులు ఉంటాయో తెలుసా?

ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత అనేక నిబంధనలు

Update: 2023-10-28 17:02 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత అనేక నిబంధనలు అమల్లోకి వస్తాయి. ఈ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై ఈసీ అధికారులు కఠిన చర్యలు తీసుకుంటారు. కేసులు నమోదు చేయడంతో పాటు జైలు శిక్షలు కూడా పడే అవకాశముంది. ఎన్నికల అధికారులకు విధి నిర్వహణలో ఆటంకం కలిగిస్తే బైండోవర్ కేసులు నమోదు చేస్తారు. అనంతరం కోర్టులో ప్రవేశపెడతారు.

ఎన్నికల విధులకు భంగం కలిగించిన కేసులో ఏడాదిన్నర వరకు జైలుశిక్ష పడే అవకాశముంది. ఇక బ్యాలెట్ బాక్స్‌లను, ఈవీఎం బాక్స్‌లను ఎత్తుకెళ్లే సమయంలో ఎన్నికల అధికారులకు ఇబ్బంది కలిగించడం వంటి పనులు చేస్తే కఠిన కారాగార శిక్షలు విధిస్తారు. ఇక దొంగ ఓటు, ఒకరికి బదులు మరొకరు ఓటు వేసినట్లు నిర్ధారణ అయితే ఏడాది పాటు జైలుశిక్ష వేసే అవకాశముంటుంది. 


Similar News