Pawan Kalyan:డిప్యూటీ సీఎం పవన్ కాన్వాయ్ అడ్డగింత
ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం లో ఉచిత గ్యాస్ సిలిండర్ పంపిణీ కార్యక్రమం పర్యటన నేపథ్యంలో
దిశ,రాజమహేంద్రవరం: ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం లో ఉచిత గ్యాస్ సిలిండర్ పంపిణీ కార్యక్రమం పర్యటన నేపథ్యంలో రాజమండ్రి చేరుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాన్వాయ్‌ను ఆలమూరులో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న విద్యార్థిని వెన్నెల తల్లిదండ్రులు అడ్డుకున్నారు. వెన్నెల ఆత్మహత్యకు పాఠశాల యాజమాన్యమే కారణమని,తమకు న్యాయం చేయాలని వారు కోరారు. పర్యటన అనంతరం మధ్యాహ్నం వచ్చి ఈ సమస్య పై మాట్లాడతానని పవన్ కళ్యాణ్ వారికి హామీ ఇచ్చారు.