Ap news: విద్యార్థినికి తాళి కట్టి అత్యాచారం.. హిందీ టీచర్ అరెస్ట్
విద్యా బుద్దులు చెప్పాల్సిన టీచర్ లైన్ తప్పారు. పాఠాలు చెప్పాల్సింది పోయి ప్రేమ వల విసిరారు...
దిశ, వెబ్ డెస్క్: విద్యా బుద్దులు చెప్పాల్సిన టీచర్ లైన్ తప్పారు. పాఠాలు చెప్పాల్సింది పోయి ప్రేమ వల విసిరారు. విద్యార్థినిని ప్రేమించానని చెప్పాడు. పెళ్లి చేసుకున్నాడు. చివరకు అత్యాచారం చేసి మోసం చేశాడు. దీంతో బాధితురాలి పోలీసులు ఆశ్రయించడంతో కటకటాలపాలయ్యాడు. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లాలో జరిగింది.
పశ్చిమగోదావరి జిల్లా భీమవరం మండలం తాడేరులో పురేళ్ల సోమరాజు హిందీ టీచర్‌గా పని చేస్తున్నారు. అయితే పదో తరగతి చదువుతున్న విద్యార్థిపై కన్నేశాడు. ప్రేమ పేరుతో వల వేశాడు. ప్రేమిస్తున్నానని.. పెళ్లి చేసుకుంటామనని నమ్మించాడు. నాలుగు రోజుల క్రితం మాయ మాటలు చెప్పి విద్యార్థినిని తన బైక్‌పై తీసుకెళ్లాడు. పెళ్లి చేసుకున్నాడు. అనంతరం అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సదరు హిందీ టీచర్ సోమరాజును పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిపై పోక్సో చట్టం, బాల్య వివాహ నిరోధక చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై పూర్తి దర్యాప్తునకు దిశ డీఎస్పీని ఎస్పీ రవి ప్రకాశ్ నియమించారు. అయితే నిందితుడిని కఠినంగా శిక్షించాలని బాధితురాలి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.