Nitish Kumar Reddy : ఆంధ్ర నుంచి నా లాంటి ప్లేయర్లు ఇంకా రావాలి : నితీష్ కుమార్ రెడ్డి

ఆంధ్ర(AP) నుంచి నా లాంటి ప్లేయర్లు(Players) ఇంకా రావాలని భారత యువ క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి (Nitish Kumar Reddy)ఆకాంక్షించారు.

Update: 2025-01-16 09:29 GMT
Nitish Kumar Reddy : ఆంధ్ర నుంచి నా లాంటి ప్లేయర్లు ఇంకా రావాలి : నితీష్ కుమార్ రెడ్డి
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్ర(AP) నుంచి నా లాంటి ప్లేయర్లు(Players) ఇంకా రావాలని భారత యువ క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి (Nitish Kumar Reddy)ఆకాంక్షించారు. నేను బాగా ఆడితేనే నాలాంటి ఎంతో మంది యువ ఆటగాళ్లకు జాతీయ జట్టుకు ఎంపికవ్వచ్చన్న నమ్మకం వస్తుందన్నారు. రానున్న టోర్నమెంట్ లలో కూడా బాగా ఆడి మన ఏపీకి మంచి పేరు తెస్తానన్నారు. ఆంధ్రకు చెందిన కేఎస్ భరత్, హనుమ విహారి, ఎంఎస్ కే ప్రసాద్, వేణుగోపాల్ రావు లాంటి ఆటగాళ్లు నాకు స్పూర్తి అని చెప్పారు.

క్రికెట్ లో నాకు చిన్నప్పటి నుంచి విరాట్ కోహ్లీ ఆదర్శమని మరోసారి చెప్పుకొచ్చారు. చాంపియన్స్ ట్రోఫీ జట్టును ప్రకటించలేదని..చోటు దక్కితే ఖచ్చితంగా ఆ ట్రోఫీలో జట్టు గెలుపు కోసం 110శాతం శ్రమిస్తానన్నారు. ఆస్ట్రేలియాలో భారత జట్టుకు ఎంపికైన తొలి సిరీస్ లోనే అసీస్ పై సెంచరీ సాధించి అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు సంపాదించిన నితీష్ కుమార్ స్వరాష్ట్రం ఆంధ్రలో పర్యటిస్తున్న క్రమంలో అంతటా ఆయనకు ఘన స్వాగతం పలుకుతున్నారు. 

Tags:    

Similar News