AP Volunteer:ఏపీ ప్రభుత్వానికి వలంటీర్ల వార్నింగ్..!

ఏపీలో గత వైసీపీ ప్రభుత్వం(YSRCP) తీసుకొచ్చిన వలంటీర్(volunteers) వ్యవస్థ పై చర్చలు జరుగుతున్నాయి.

Update: 2024-09-25 02:43 GMT

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో గత వైసీపీ ప్రభుత్వం(YSRCP) తీసుకొచ్చిన వలంటీర్(volunteers) వ్యవస్థ పై చర్చలు జరుగుతున్నాయి. వలంటీర్ వ్యవస్థను(Volunteer system) కొనసాగిస్తారా? లేదా? అనే సందేహాలు గ్రామ వలంటీర్లలో నెలకొన్నాయి. ఈ వ్యవస్థను కొనసాగించడం రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. వలంటీర్(Volunteer) వ్యవస్థను కొనసాగిస్తామని కూటమి ప్రభుత్వం పదేపదే చెబుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వలంటీర్లు ఏపీ ప్రభుత్వాన్ని(AP Government) సంచలన డిమాండ్ చేశారు. వలంటీర్లను కొనసాగిస్తామని సీఎం చంద్రబాబు(CM Chandrababu) తెలిపిన సంగతి తెలిసిందే.

వలంటీర్లను వెంటనే విధుల్లోకి తీసుకోవాల‌ని, ఇచ్చిన మాటను సీఎం చంద్రబాబు నిలబెట్టుకోవాల‌ని కోరారు. ఈ నేపథ్యంలో తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని వలంటీర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి వంద రోజులైనా ఉద్యోగ భద్రత(Job security) కల్పించకపోవడంతో 2.60 లక్షల మంది పరిస్థితి గందరగోళంగా మారిందన్నారు. వచ్చే కేబినెట్ సమావేశం లోపు న్యాయం చేయకుంటే సీఎం క్యాంప్ కార్యాలయం ముట్టడిస్తామని హెచ్చరించారు. సమస్యల పరిష్కారం కోసం రేపటి (సెప్టెంబర్ 26) నుంచి అక్టోబర్ 2 వరకు గాంధేయ మార్గంలో శాంతియుతంగా ఆందోళనలు చేస్తామని వలంటీర్లు తెలిపారు.


Similar News