రూ.75 కోట్లతో భోగాపురం ఎయిర్‌పోర్టుకు నీటి వనరులు

Update: 2023-01-07 13:45 GMT

దిశ, ఉత్తరాంధ్ర: విజయనగరం జిల్లా భోగాపురంలో త్వరలో నిర్మించబోయే అంతర్జాతీయ విమానాశ్రయానికి నీటి సరఫరా కోసం రూ.75 కోట్లు ప్రతిపాదనలు పంపినట్లు ఆర్‌డబ్ల్యూఎస్‌ ఉన్నతాధికారులు తెలిపారు. నీటి వనరులను పరిశీలించేందుకు రాష్ట్ర ఆర్డబ్ల్యూఎస్‌ చీఫ్ ఇంజనీర్‌ వి.రవికుమార్‌ విమానాశ్రయ ప్రతిపాదిత ఏరియాలో పర్యటించారు. తారకరామా తీర్థసాగర్‌ నుంచి నీటిని తీసుకెళ్లేందుకు, అలాగే భోగాపురం మండలం చేపలకంచేరు సముద్రపు నీటిని డి శానిటేషన్‌ చేసేందుకు సాధ్యాసాధ్యాలపై అధికారులతో కలిసి పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో ఇంజనీరింగ్‌ ఉన్నతాధికారులతో పాటు ఎస్‌.ఇ.ఉమాశంకర్, ఎయిర్‌ పోర్ట్‌ అథారిటటీ అధికారి అప్పలనాయుడు, ఆర్‌.డబ్ల్యూ.ఎస్‌.డి.ఈ జమ్మూ వైకుంఠం నాయుడు, జె.ఇ.హేమంత్‌ కుమార్‌ పాల్గొన్నారు.

Tags:    

Similar News