ఎన్నికల వేళ వైసీపీకి బిగ్ షాక్..ఆ పార్టీలోకి భారీ చేరికలు
పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతి రాజు సమక్షంలో వైసీపీ నుంచి టీడీపీలోకి గురువారం భారీ చేరికలు జరిగాయి.
దిశ ప్రతినిధి,విజయనగరం: పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతి రాజు సమక్షంలో వైసీపీ నుంచి టీడీపీలోకి గురువారం భారీ చేరికలు జరిగాయి. విజయనగరం పట్టణం 3వ డివిజన్ వైసీపీ నాయకులు, కార్పొరేటర్ వజ్రపు సత్య గౌరీ, వజ్రపు శ్రీనివాసరావు, జి.రమణ, బర్నాల సంతోష్, దువ్వు శ్రీను తో పాటు 500 కుటుంబాలు చేరారు. 37 వ డివిజన్ కు చెందిన వైసీపీ నాయకులు మాజీ కౌన్సిలర్ మజ్జి బాబు, పడగల రమణ, మజ్జి రమేష్, మజ్జి శ్రీనివాసరావు తో పాటు 400 కుటుంబాలు చేరారు. విజయనగరం మండలం బడుకొండ పేట గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు వార్డు మెంబర్ పతివాడ శంకరరావు, పతివాడ సత్యం, కర్రోతు రామస్వామి తో పాటు 15 కుటుంబాల చేరారు. రీమా పేట గ్రామానికి చెందిన బి.ఎస్.ఎన్. రాజు, రామరాజు తో పాటు 5 కుటుంబాల వారు వీరంతా వైసీపీ ప్రభుత్వంపై విసిగిపోయి జిల్లా మరియు రాష్ట్ర అభివృద్ధి నారా చంద్రబాబు నాయుడు తోనే అని నమ్మి వైసీపీని వదిలి టీడీపీ లోకి చేరారు. వారందరికీ టీడీపీ- జనసేన - బీజేపీ కూటమి అభ్యర్థి పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతి రాజు కండువాతో పార్టీలోకి ఆహ్వానించారు.