విశాఖ నుంచి Cm Jagan పాలన.. ముహూర్తం ఖరారు!

అమరావతి రాజధాని అంశంపై సుప్రీం కోర్టు తీర్పు హర్షణీయమని రాష్ట్రమంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. ఈ తీర్పుతోనైనా టీడీపీ, తోక పార్టీలు బుద్ధి తెచ్చుకోవాలని హితవు పలికారు. ..

Update: 2022-11-28 13:59 GMT
  • సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం
  • 175 నియోజకవర్గాల్లో జనసేన పోటీ చేస్తే వెళ్లిపోతా
  • - రాష్ట్రమంత్రి గుడివాడ అమర్నాథ్

దిశ, డైనమిక్ బ్యూరో: అమరావతి రాజధాని అంశంపై సుప్రీం కోర్టు తీర్పు హర్షణీయమని రాష్ట్రమంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. ఈ తీర్పుతోనైనా టీడీపీ, తోక పార్టీలు బుద్ధి తెచ్చుకోవాలని హితవు పలికారు. అమరావతి రాజధాని అన్నది ఓ స్కాం అని మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆరోపించారు. అమరావతి రైతులు ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకోవాలని.. టీడీపీ వాళ్లు అమరావతి రైతులను బెదిరించి భూములను లాక్కున్నారన్నారు. హైదరాబాద్ కోసమే తెలంగాణ ఉద్యమం జరిగిందని మళ్లీ అలాంటి పరిస్థితి రాకూడదనే మూడు ప్రాంతాలు అభివృద్ధికి సీఎం వైఎస్ జగన్ శ్రీకారం చుట్టారన్నారు. సీఎం జగన్ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు కూడా ఏకీభవించినట్లు వ్యాఖ్యలు చేసిందన్నారు. అమరావతి ప్రాంతం రాజధానిగా ఆమోదయోగ్యం కాదన్నారు. అలాగని అమరావతి అభివృద్ధికి తాము వ్యతిరేకం కాదని.. అమరావతి శాసన రాజధానిగా ఉంటుందని మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పష్టం చేశారు. రాజధాని అంటే జేబులు నింపుకునే కార్యక్రమమని చంద్రబాబు భావిస్తున్నారని విమర్శించారు. వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి విశాఖ నుంచే వైఎస్ జగన్ పాలన కొనసాగిస్తారని మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. మరోవైపు జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్ 175 నియోజకవర్గాల్లో పోటీ చేస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకోవడంతోపాటు ఎక్కడికైనా వెళ్లిపోతానని సవాల్ విసిరారు. గతంలో జగన్ సీఎం కాలేడని కూడా ఇలాంటి శపథాలే చేశారని ఇప్పుడు మళ్లీ అవిరిపీట్ చేస్తున్నాడని మంత్రి గుడివాడ అమర్నాథ్ విమర్శించారు.

ఇవి కూడా చదవండి 

'Amaravatiలోనే హైకోర్టు.. సీమకు అన్యాయం చేస్తున్నారు' 

Tags:    

Similar News