Vijayawada:ప్రపంచ తెలుగు రచయితల మహాసభల నిర్వహణపై సీఎం చంద్రబాబు ట్వీట్
విజయవాడలోని కేబీఎన్ కళాశాలలో శని, ఆదివారాల్లో రెండు రోజుల పాటు తెలుగు రచయితల మహాసభలు జరగనున్నాయి.
దిశ,వెబ్‌డెస్క్: విజయవాడలోని కేబీఎన్ కళాశాలలో శని, ఆదివారాల్లో రెండు రోజుల పాటు తెలుగు రచయితల మహాసభలు జరగనున్నాయి. దేశవిదేశాల నుంచి 1500 మందికి పైగా రచయితలు, కవులు ఈ మహాసభలకు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో విజయవాడలో(Vijayawada) ప్రపంచ తెలుగు రచయితల(World Telugu Writers) మహాసభలు నిర్వహించుకోవడం తెలుగువారందరికీ గర్వకారణం అని సీఎం చంద్రబాబు(CM Chandrababu) ట్విట్టర్ వేదికగా తెలిపారు.
ఈ మేరకు ‘‘మాతృభాషను భవిష్యత్ తరాలకు పదిలంగా అందించడమే లక్ష్యంగా నిర్వహిస్తున్న ఈ మహాసభలు జరిగే ప్రాంగణానికి, అమరజీవి పొట్టి శ్రీరాములు గారి పేరును పెట్టడం ఆ మహానుభావుడు తెలుగు జాతి కోసం చేసిన అద్వితీయ త్యాగాన్ని ప్రతి ఒక్కరికీ గుర్తు చేస్తోంది అన్నారు. అలాగే ప్రధాన వేదికకు తెలుగు భాషాభివృద్ధి కోసం గణనీయ కృషి చేసిన రామోజీరావు గారి పేరు పెట్టడం కూడా అభినందనీయం అన్నారు. ఈ మహాసభలకు విచ్చేసిన అతిథులకు, పాల్గొంటున్న తెలుగు భాషాభిమానులకు అందరికీ ధన్యవాదాలు. ఈ మహాసభలు విజయవంతం అవ్వాలని కోరుకుంటూ.. నిర్వాహకులకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను’’ సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు.