పైడితల్లి ఉత్సవాలకు లోక్ సభ స్పీకర్ కు ఆహ్వానం
ఆంధ్ర ప్రజలకు, ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రజలకు అత్యంత ఆరాధ్య దైవమైన పైడితల్లి ఉత్సవాలు ప్రతియేటా ఎంతో ఘనంగా జరుగుతాయి.
దిశ, వెబ్ డెస్క్ : ఆంధ్ర ప్రజలకు, ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రజలకు అత్యంత ఆరాధ్య దైవమైన పైడితల్లి ఉత్సవాలు ప్రతియేటా ఎంతో ఘనంగా జరుగుతాయి. ఈ ఏడాది కూడా వైభవంగా పైడితల్లి ఉత్సవాలు జరిపేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. అయితే ఈ ఏడాది అమ్మవారి ఉత్సవాలకు లోక సభ స్పీకర్ ఆదిత్య ఓం బిర్లా(Adithya Om Birla)ను ఆహ్వానించారు. ఈ మేరకు ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు సోమవారం స్వయంగా స్పీకర్ ఇంటికి వెళ్ళి పైడితల్లి అమ్మవారి ఉత్సవాలకు హాజరు కావాలని కోరారు. అయితే కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు వంశీయుల కోరిక మేరకు స్పీకర్ ఆదిత్యా ఓం బిర్లాకు ఆహ్వానం పలికినట్లు అప్పలనాయుడు పేర్కొన్నారు. ఈ సందర్భంగా స్పీకర్ కు తిరపతి లడ్డూను అందజేశారు. కాగా పైడితల్లి సిరిమాను ఉత్సవాలు ఈనెల 13 నుండి 15 వరకు నిర్వహించనున్నట్టు ఆలయ కమిటీ ప్రకటించింది.