బీసీలు అంటే బ్యాక్ వర్డ్ క్లాసెస్ కాదు బ్యాక్ బోన్ క్లాసెస్..
జగ్గయ్యపేట పట్టణంలో శుభమస్తు ఫంక్షన్ హాల్ నందు "జయహో బిసి జయహో తాతయ్య" ,"చేయి చేయి కలుపుదాం.
దిశ,ప్రతినిధి, విజయవాడ : జగ్గయ్యపేట పట్టణంలో శుభమస్తు ఫంక్షన్ హాల్ నందు "జయహో బిసి జయహో తాతయ్య" ,"చేయి చేయి కలుపుదాం. తాతయ్యను గెలిపిద్దాం" జగ్గయ్యపేట నియోజకవర్గ బీసీ ల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా విజయవాడ పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నెట్టెం రఘురాం, టీడీపీ జాతీయ కోశాధికారి, నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి. శ్రీరాం రాజగోపాల్ తాతయ్య, రాష్ట్ర బీసీ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి వీరంకి గురుమూర్తి పాల్గొన్నారు.బీసీలు అంటే బ్యాక్ వర్డ్ క్లాసెస్ కాదు. బ్యాక్ బోన్ క్లాసెస్ అని అన్నారు.టీడీపీ ప్రభుత్వ హాయంలో నారా చంద్రబాబునాయుడు ఆదరణ పథకంతో బీసీలను అన్ని విధాల ఆదుకోవడం జరిగిందన్నారు.
90 శాతం సబ్సిడీతో లబ్ధిదారులకు పరికరాలు 125 కులాలకు ఆర్థిక సాయం తెలుగుదేశం ప్రభుత్వం లోనే జరిగిందన్నారు. బీసీలకు రూ 75 వేల కోట్లు ఖర్చు చేస్తామని చెప్పిన జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఐదు సంవత్సరాలు పూర్తవుతున్నప్పటికీ బీసీలకు ఒక్క రూపాయి అయినా జగన్ ఇచ్చారా అని ప్రశ్నించారు. గత తెలుగుదేశం ప్రభుత్వంలో 34 శాతం ఉన్న స్థానిక సంస్థల రిజర్వేషన్లు వైసీపీ ప్రభుత్వం రాగానే 24 శాతానికి తగ్గించారు. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను రద్దు చేశారన్నారు. కనీసం బీసీ భవనాలను కూడా పూర్తి చేయలేకపోయారు. బీసీలకు ఏం చేశారని వైసీపీ నేతలు సాధికార యాత్ర చేపడుతున్నారు. ప్రతి ఒక్కరి ఆదాయం పెరిగితేనే నిజమైన అభివృద్ధి అని అన్నారు. టిడిపి పాలనలో బీసీలకు ఎంత మేలు జరిగిందో, వైసీపీ పాలనలో బీసీలు ఏం కోల్పోయారో ప్రజలకు వివరించారు.
మంగళగిరిలో జరిగిన జయహో బీసీ సభలో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు. మరియు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. ప్రకటించిన బీసీ డిక్లరేషన్ ఆనందదాయకమన్నారు.పది లక్షల రూపాయల చంద్రన్న బీమా, లక్ష రూపాయలు పెళ్లి కానుక అందిస్తామని, శాశ్వత కుల ధ్రువీకరణ పత్రాలు ఇస్తామని,గతంలో ఉన్న విద్యా పథకాలు అన్నింటినీ పునరుద్ధరిస్తామని, వెనుకబడిన కులాలకు చెందిన విద్యార్థులకు ఆర్థిక చేయూత అందిస్తామని పేర్కొనడం చంద్రబాబు నాయకత్వ పటిమకూ,దార్శినికతకూ తార్కాణం అని కొనియాడారు.నియోజకవర్గంలో బీసీ నాయకులు దొంతు చిన్న, రాష్ట్ర బీసీ సెల్ నాయకురాలు యలగాల నూకాలమ్మ, జగ్గయ్యపేట మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీరాం సుబ్బారావు, ఉమ్మడి కృష్ణాజిల్లా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి బాడిశ మురళీకృష్ణ. మరియు వివిధ హోదాలలో ఉన్న బీసీ నాయకులు పాల్గొన్నారు.