Janasena: 609 ఎకరాల భూముల్లో అక్రమాలు.. మంత్రి అమర్నాథ్‌పై తీవ్ర ఆరోపణలు

అనకాపల్లి జిల్లా కసింకోట మండలం విస్సన్నపేటలో 609 ఎకరాల భూ కుంభకోణంలో బినామీల పేరుతో మంత్రి అమర్నాథ్ అవినీతికి పాల్పడ్డారని అనకాపల్లి జనసేన నాయకుడు దూలం గోపినాథ్ ఆరోపించారు..

Update: 2023-05-22 13:14 GMT

దిశ అనకాపల్లి: అనకాపల్లి జిల్లా కసింకోట మండలం విస్సన్నపేటలోని 609 ఎకరాల భూముల్లో బినామీల పేరుతో మంత్రి అమర్నాథ్ అవినీతికి పాల్పడ్డారని అనకాపల్లి జనసేన నాయకుడు దూలం గోపినాథ్ ఆరోపించారు. చంద్రబాబు  చేసిన ఆరోపణలు ఖండిస్తూ మంత్రి అమర్నాథ్ తనకు ఎటువంటి సంబంధం లేదని  చెప్పడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. ఈ భూకుంభకోణంపై మొదటి నుంచి జనసేన పోరాడుతుందని, అందుకు సంబంధించిన సాక్ష్యాలు సైతం తమ వద్ద ఉన్నాయని చెప్పారు. మంత్రి తన ప్రధాన అనుచరుడు బొడ్డేడ ప్రసాద్, ఆయన తండ్రి పేరుతో మొదటి అమ్మకాలు జరిపినట్టు ఈసీ పత్రాలు చూపించారని, రెవిన్యూ రికార్డులను సైతం మార్పిడి చేశారని ఆరోపించారు. విస్సన్నపేట భూ కుంభకోణంలో అధికారులకు ఫిర్యాదు చేసినా విచారణ చేపట్టలేదని దూలం గోపినాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Tags:    

Similar News