High Court: వివేకా హత్య కేసు విచారణ వాయిదా
వివేకానందారెడ్డి హత్య కేసు(Vivekananda Reddy murder case) విచారణ వాయిదా పడింది....
దిశ, వెబ్ డెస్క్: వివేకానందారెడ్డి హత్య కేసు(Vivekananda Reddy murder case) విచారణ వాయిదా పడింది. ఈ కేసులో తనకు బెయిల్ ఇవ్వాలని కోరుతూ తెలంగాణ హైకోర్టు(Telangana High Court)లో ఏ3 నిందితుడు ఉమాశంకర్ రెడ్డి(Accused Umashankar Reddy) పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం ముందు వాదనలు కొనసాగాయి. ఉమా శంకర్ రెడ్డిని ప్రత్యక్ష సాక్షి గుర్తించలేదని, పొడవుగా, నల్లగా ఉన్నాడని చెప్పిన మాటల ఆధారంగానే ఈ కేసులో ఉమాశంకర్ రెడ్డిని నిందితుడిగా చేర్చారని ఆయన తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. అయితే సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడిగా ఉమాశంకర్ రెడ్డిని గుర్తించామని సీబీఐ(CBI) తరపున కోర్టుకు తెలిపారు. ఇరువర్గాల వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణను వాయిదా వేసింది.