ఇంద్రకీలాద్రిపై మహిషాసురమర్దినిగా దుర్గమ్మ దర్శనం

ఇంద్రకీలాద్రిపై దసరా సందర్భంగా దుర్గమ్మ శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి.

Update: 2024-10-11 05:15 GMT

దిశ, వెబ్ డెస్క్ : ఇంద్రకీలాద్రిపై దసరా సందర్భంగా దుర్గమ్మ శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. తొమ్మిదవ రోజున మహిషాసురమర్దిని అలంకారంలో దుర్గమ్మ దర్శనమిస్తున్నారు. భక్తులు వేలాదిగా తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. మహిషాసుర సంహారం జరిగిన రోజునే 'మహర్నవమి'గా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఇంద్రకీలాద్రిపై రేపు పూర్ణాహుతితో ఉత్సవాలు పరిసమాప్తం కానున్నాయి. భవానీ దీక్షాధారుల రాకతో ఇంద్రకీలాద్రిపై భక్తులు రద్దీ పెరిగింది. జలవిహారంపై ఇవాళ మధ్యాహ్నంలోగా నిర్ణయం తీసుకోనునున్నారు.

దుర్గమ్మను ఏసీ సీఎస్‌ నీరబ్‌కుమార్‌ ప్రసాద్‌ దంపతులు దర్శించుకున్నారు. దసరా ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయని, దుర్గమ్మ అనుగ్రహంతో రాష్ట్రం సమగ్రాభివృద్ధి దిశగా పురోగమిస్తుంచాలని ఆకాంక్షించారు. నీతిఆయోగ్‌ ప్రతినిధుల బృందం దుర్గమ్మను దర్శించుకుని అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు.


Similar News