Visakha Port: సరుకు రవాణాలో సరికొత్త రికార్డు
విశాఖపట్నం పోర్టు ట్రస్టు పాత రికార్డులను తిరగరాస్తు సరుకు రవాణాలో సరికొత్త రికార్డును నెలకొల్పింది...
దిశ, ఉత్తరాంధ్ర: విశాఖపట్నం పోర్టు ట్రస్టు పాత రికార్డులను తిరగరాస్తు సరుకు రవాణాలో సరికొత్త రికార్డును నెలకొల్పింది. విశాఖపట్నం పోర్టు ఆవిర్భవించిన తర్వాత ఒక్క రోజులో అత్యధిక సరుకు రవాణా చేసిన ఘనతను కూడా సాధించింది. ఈనెల 17న 4,01,875 మెట్రిక్ టన్నుల సరుకును 23 షిప్పుల నుంచి వివిధ బెర్త్‌లు ద్వారా హ్యాండిల్ చేసి గతంలో ఒక్క రోజులో చేసిన అత్యధిక సరుకు రవాణా రికార్డును తిరగరాసింది.
ఇంతకు మునుపు గత నెల 7న పోర్టులోని వివిధ బెర్త్‌ల ద్వారా 27 షిప్‌లో నుంచి చేసిన 3,78,760 మెట్రిక్ టన్నుల సరుకు రవాణా ఇప్పటి వరకు ఒక్కరోజులో పోర్ట్ చేసిన అత్యధిక సరుకు రవాణాగా రికార్డుల్లో ఉంది. విశాఖపట్నం పోర్టు నూతన రికార్డులను సాధించటం పట్ల సిబ్బందిని పోర్టు అథారిటీ చైర్మన్ డాక్టర్ ఎం. అంగముత్తు పోర్టు ట్రాఫిక్ మేనేజర్ రత్న శేఖర్ ప్రశంసించారు. పోర్టు సిబ్బంది కలిసికట్టుగా పని చేయటం ద్వారా మరిన్ని కొత్త రికార్డులను తిరగ రాయవచ్చని పోర్టు చైర్మన్ ఉద్యోగులకు సూచించారు. పోర్టు ఈ ఘనతను సాధించడంలో కృషి చేసిన ట్రాఫిక్ విభాగం సిబ్బందిని డిప్యూటీ చైర్మన్ దుర్గేష్ కుమార్ దుబే, కార్యదర్శి టి. వేణుగోపాల్ ప్రశంసించారు.