Vande Bharat Express: గంటకు 160 కి.మీ వేగంతో దూసుకుపోతున్న వందేభారత్
ప్రధాని మోడీ మేకిన్ ఇండియా నిర్ణయంతో గంటకు 160 కి.మీ వేగంతో పరుగులు పెట్టే వందే భారత్ రైలు పట్టా లెక్కింది...
దిశ ఉత్తరాంధ్ర: ప్రధాని మోడీ మేకిన్ ఇండియా నిర్ణయంతో గంటకు 160 కి.మీ వేగంతో పరుగులు పెట్టే వందే భారత్ రైలు పట్టా లెక్కింది. గతంలో మరెప్పుడూ లేనంతగా రెండు తెలుగు రాష్ట్రాల్ని కలిపేలా సికింద్రాబాద్, విశాఖ మధ్య నడిచే వందే భరత్ రైలుకు ప్రధాని మోడీ వర్చ్యువల్‌గా ఈ నెల 15న ప్రారంభించారు. సికింద్రాబాద్‌లో ఉదయం 10.30 గంటలకు బయల్దేరిన ఈ ప్రతిష్టాత్మక రైలు అక్కడక్కడ ఆగి జనాలు స్వాగతం పలకడంతో తొలిరోజు విశాఖకు ఆదివారం రాత్రి 10.45గంటలకు చేరింది. 700కి.మీ దూరం కేవలం 8గంటల్లోనే చేరేలా అత్యాధునిక హంగులతో తయారైన ఈ రైలు గరిష్టంగా 160కి.మీ వేగంతో వెళుతుంది. కేవలం 8గంటల్లోనే వరంగల్, ఖమ్మం, విజయవాడ, రాజమండ్రి మీదుగా విశాఖ చేరుకుంది. ఆత్మ నిర్భర భారత్.. ఆజాదీ కా అమృతోత్సవ్ అంటూ జనం జేజేలు పలుకుతున్నారు.
రైలు ప్రత్యేకతలు..
ట్రైలింగ్ చైర్ కార్ 4, మోటార్ చైర్ కార్ 8, ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ 2, నాన్ డ్రైవింగ్ ట్రైలింగ్ చైర్ కార్ 2..ఇలా మొత్తం 16కంపార్ట్‌మెంట్‌లున్నాయి. 16 ఏసీ బోగీలతో ఉండే ఈ రైల్లో అధునాతన సౌకర్యాలను అమర్చారు. ప్రయాణికులకు స్వాగతం పలికేందుకు ఎయిర్ హోస్టెస్‌లో ఉండేలా రైలు హోస్టెస్ ఉన్నారు. మెట్రో టైన్ తరహాలోనే వాటంతటవే తెరుచుకునే ఆటోమెటెడ్ డోర్లు, ప్లాట్‌ఫారం మీదకు దిగేందుకు సులువైన మెట్లు, ప్రతి సీటు వద్ద అల్పాహారం తీసుకునేందుకు టీపాయ్ ప్లేట్, కాళ్లు చాపుకొనేందుకు ఫుట్ ప్లేట్, ఎండ తగలకుండా మిర్రర్ ఆప్షన్, సీటు కింద మొబ్కెల్ చార్జింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేశారు. ఫింగర్ టచ్ ల్కెట్లు, సీసీ కెమెరాలు, ఎల్‌ఈడీ ల్కెట్లు వందేభారత్ రైలులో ప్రత్యేకం. అల్పాహారంతో (స్నాక్స్) పాటు భోజనం సమకూర్చుతారు. పూర్తి స్థాయి వైఫై అందుబాట్లో ఉంటుంది.
20834/20833సర్వీసుల కింద సికింద్రాబాద్, విశాఖ మధ్య ఆదివారం మినహా మిగతా రోజుల్లో నిత్యం తిరుగుతుంది. ఆటోమెటెడ్ డోర్ లాకింగ్ ఉంది. రైలు సిబ్బంది ప్రతి సమాచారాన్ని మూడు భాషల్లో ప్రయాణికులకు పబ్లిక్ అడ్రసింగ్ సిస్టం ద్వారా అందజేస్తారు. సీటింగ్ కెపాసిటీ 1200 వరకూ అమర్చారు. అత్యవసర సమయంలో ట్క్రెన్ క్రూకు సమాచారం ఇచ్చేందుకు మైక్ ఉంది.