Visakha: నర్సీపట్నంలో రూ.2కే భోజనం

అన్న క్యాంటీన్ల మొత్తాన్ని మూసేసినా, అన్ని దానాల కంటే అన్న దానం గొప్పదన్న స్ఫూర్తితో పేదల ఆకలి తీర్చడం కోసం అన్న క్యాoటీన్ ప్రారంభించామని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు అన్నారు....

Update: 2023-06-12 11:34 GMT

దిశ, ఉత్తరాంధ్ర: అన్న క్యాంటీన్ల మొత్తాన్ని మూసేసినా, అన్ని దానాల కంటే అన్న దానం గొప్పదన్న స్ఫూర్తితో పేదల ఆకలి తీర్చడం కోసం అన్న క్యాoటీన్ ప్రారంభించామని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు అన్నారు. నర్సీపట్నంలో అన్న క్యాంటీన్ ప్రారంభించి పేదలకు భోజనాన్ని వడ్డించారు. లక్షలాదిమంది పేదల ఆకలి తీర్చిన అన్న క్యాంటీన్లను అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రారంభిస్తామన్నారు. అన్న క్యాంటీన్‌లో 2 రూపాయలకే భోజనం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అన్ని వర్గాల ప్రజలను అవస్థలపాలు చేసి, అన్ని వ్యవస్థలను నాశనం చేసిన ప్రస్తుత పాలన పోయి, తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.  ఆనాడు ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టి అధికారంలోకి వచ్చాక ఎన్నో సంస్కరణలు తెచ్చారని, పేదవాడి ఆకలి తీర్చారని, అందరిలో రాజకీయ చైతన్యం తెచ్చారని, మహిళలకు ఆస్తిలో సమాన హక్కు ఇచ్చారని  మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు వివరించారు.

Tags:    

Similar News