Ap News: సీఎం జగన్ నిర్ణయంపై ఆదివాసీ సంఘాల ఆగ్రహం.. బంద్‌కు పిలుపు
వాల్మీకిబోయలను ఎస్టీల్లో చేరడాన్ని ఆదివాసీ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి...
దిశ, వెబ్ డెస్క్: వాల్మీకిబోయలను ఎస్టీల్లో చేరడాన్ని ఆదివాసీ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు శుక్రవారం అల్లూరి సీతారామరాజు జిల్లాలోని ఏజెన్సీ బంద్‌కు పిలుపునిచ్చారు. అయితే ఈ బంద్‌కు మావోయిస్టు పార్టీ మద్దతు తెలిపింది. ఈ నేపథ్యంలో ఏపీఎస్ ఆర్టీసీ అప్రమత్తమైంది. ఏజెన్సీ ప్రాంతాల్లోకి వెళ్లే బస్సు సర్వీసులను రద్దు చేసింది.
కాగా ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో వాల్మీకిబోయలను ఎస్టీల్లో చేర్చుతున్నట్లు సీఎం జగన్ ప్రకటించారు. అటు అసెంబ్లీలో కూడా తీర్మానం చేశారు. ఆదివాసులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా తీర్మానం చేసినట్లు జగన్ తెలిపారు. అయితే తీర్మాన్ని ఆదివాసీ సంఘాలు వ్యతిరేకించాయి. పలుచోట్ల ఆందోళనలు కూడా నిర్వహించారు. అయినా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఆందోళనను ఉధృతం చేశారు.