విశాఖలో ఉద్రిక్తత.. మరోసారి టీడీపీ నేతల అరెస్ట్

విశాఖ టీడీపీ ప్రధాన కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి....

Update: 2023-09-12 10:07 GMT

దిశ, విశాఖపట్నం: విశాఖ టీడీపీ ప్రధాన కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చంద్రబాబు అరెస్టు తర్వాత రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులకు అనుగుణంగా టీడీపీ ఏ విధంగా స్పందించాలని అంశంపై విశాఖ తెలుగుదేశం ప్రధాన కార్యాలయంలో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అధినేత జైలులో ఉండడంతో కార్యకర్తలకు ధైర్యం నూరిపోశారు. సమావేశంలో పెద్ద ఎత్తున నాయకులు కార్యకర్తలు అక్కడకు చేరుకున్నారు. అయితే సమావేశం అనంతరం వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్యాలయం బయట ఆందోళన చేపట్టాలని పార్టీ శ్రేణులు నిర్ణయించాయి. అప్పటికే పోలీస్ వర్గాలకు సమాచారం అందడంతో అక్కడకు పెద్ద ఎత్తున బందోబస్తు చేరుకుంది. ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, మాజీ ఎమ్మెల్యే పైలా శ్రీనివాసరావు, మరో నాయకుడు పీల శ్రీనివాసరావులను పోలీసులు బలవంతంగా వాహనాల పైకి ఎక్కించారు. పసుపు జెండా కనిపించినా, టిడిపి నాయకులు కనిపించినా అకారణంగా పోలీసులు అరెస్టులకు పూనుకోవడం వెనుక ప్రభుత్వం పుట్ర ఉందని పీల శ్రీనివాసరావు అన్నారు. తమ నాయకుడు చంద్రబాబును అరెస్టు చేయడం వెనుక కుట్ర దాగి ఉందని, శాంతియుతంగా ఆందోళన చేస్తే పోలీసుల తీరు సరిగా లేదని వెలగపూడి, పైలా ధ్వజమెత్తారు.

Tags:    

Similar News