Visakha: కలాం పేరు తీసేసి వైఎస్సార్ పేరు.. సీఎం జగన్‌పై ఆగ్రహం

పేర్లు మార్చడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అలవాటుగా మారిందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు...

Update: 2023-04-19 12:55 GMT

దిశ, డైనమిక్‌బ్యూరో: పేర్లు మార్చడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అలవాటుగా మారిందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. తాజాగా విశాఖపట్నంలోని కలాం వ్యూపాయింట్ పేరును వైఎస్ఆర్ వ్యూ పాయింట్‌గా మార్చడంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ట్విటర్ వేదికగా ఖండించారు. వైజాగ్‌లోని కలాం వ్యూపాయింట్ పేరును వైఎస్సార్ వ్యూపాయింట్‌గా మార్చడంపై మండిపడ్డారు.


‘వైజాగ్‌లోని అబ్దుల్ కలాం వ్యూ పాయింట్‌ని వైఎస్ఆర్ వ్యూ పాయింట్‌గా మార్చడం బాధాకరం. పేర్లు మార్చే ఈ సైకోపతిక్ శాడిజం ఏమిటి?. ఇది నిజాయితీ, క్రమశిక్షణ, పట్టుదలకు ప్రతీకగా నిలిచిన అత్యంత ప్రియమైన ప్రజల రాష్ట్రపతిని అగౌరవపరచడం తప్ప మరొకటి కాదు’ అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విమర్శించారు.

ఇవి కూడా చదవండి: Ap News: ఉద్యోగులకు గుడ్ న్యూస్.. హెల్త్‌ స్కీమ్‌లోకి 46 రకాల చికిత్సలు


ఇకపోతే సీతకొండ ప్రాంతం ఒకప్పుడు చెత్తతో నిండిపోయి ఉండేది. అయితే వైజాగ్ వాలంటీర్స్ అసోసియేషన్ ఈ ప్రాంతాన్ని క్లీన్ చేసింది. అనంతరం ఈ ప్రాంతానికి కలాం వ్యూ పాయింట్‌ అని పేరు పెట్టుకున్నారు. కలాం పేరు పెట్టడం వల్ల ఎందరికో స్ఫూర్తి నింపిందని, అందుకే స్వచ్ఛందంగా వచ్చి శుభ్రం చేశారని తెలిపింది. అయితే వైసీపీ ప్రభుత్వం కలాం వ్యూ పాయింట్‌ను వైఎస్ఆర్ వ్యూ పాయింట్‌గా మార్చడంపై వాలంటీర్స్ అసోషియేషన్ ఖండించింది. మరి వాలంటీర్స్ అసోషియేషన్, చంద్రబాబు వ్యాఖ్యలపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.

Tags:    

Similar News