విశాఖ జిల్లాలో జోరు వాన.. కుప్పకూలిన ప్రహరీ గోడ
విశాఖ జిల్లాలో జోరు వాన కురుస్తోంది...
దిశ, వెబ్ డెస్క్: విశాఖ జిల్లా(Visakha District)లో జోరు వాన(Rains) కురుస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా జిల్లాలో రాత్రి నుంచి వర్షాలు కురుస్తున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. పలుచోట్ల వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. రోడ్లపై వాహన దారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గోపాలపట్న ఇందిరానగర్ కొండవాలు ప్రాంతంలో ప్రహారీ గోడ(Defensive wall)కుప్పకూలింది. అయితే ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. విషయం తెలుసుకున్న జీవీఎంసీ అధికారులు యుద్ధ ప్రతిపాదికన ప్రహారీ గోడ శిథిలాలను తొలగిస్తున్నారు. అటు విజయనగరం(Vizianagaram)లోనూ భారీగా వర్షం కురిసింది. జిల్లాలో పలుచోట్ల అత్యధిక వర్ష పాతం నమోదు అయింది. వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తత ప్రకటించారు. కొండవాలు, లోతట్టు ప్రాంతాల్లో ఎవరూ ఉండొద్దని సూచించారు. వర్షం కారణంగా ఇబ్బందులు కలిగితే వెంటనే తమకు సమాచారం అందించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.