Make in India: గిరాకీ పెరిగేనా ?

దేశం మనదే.. తేజం మనదే.. ఎగురుతున్న జెండా మనదే.. మేకిన్ ఇండియా అమలుతో విదేశీ వస్తువుల నిషేధం తెరపైకి వచ్చింది..

Update: 2023-01-14 14:41 GMT

దిశా ఉత్తరాంధ్ర: దేశం మనదే.. తేజం మనదే.. ఎగురుతున్న జెండా మనదే.. మేకిన్ ఇండియా అమలుతో విదేశీ వస్తువుల నిషేధం తెరపైకి వచ్చింది. గాలి పతంగులకు వాడే చైనా మాంజా సహితం నిషేధంలో ఉంది. ఇలాంటి సమయంలో స్వదేశీ వస్తువులకు మేకిన్ ఇండియా దారి చూపిస్తుందని చిరువ్యాపారులు ఆశగా ఎదురు చూస్తున్నారు.

పండుగ సమయాల్లో విశాఖ బీచ్‌లో గాలిపటాల పోటీలు ఎంతో ఆసక్తిని రేపుతాయి. రంగు రంగుల పతంగులు ఆహ్లాదాన్ని పంచుతాయి. పతంగుల పండుగకు చిన్నా పెద్ద వయసుతో తారతమ్యం లేదు. పతంగుల జోరు చూస్తే అందరూ కేరింతలు కొట్టాల్సిందే. రకరకాల బొమ్మలు..పెద్ద పెద్ద పతంగులు పండుగకు పది రోజుల ముందే విశాఖ వీధుల్లో దుకాణాల్లో సందడి చేశాయి. గతంలో గాలి పటాల మాంజా చైనా నుంచి దిగుమతి చేసుకునే వారు. మేకిన్‌ ఇండియాలో భాగంగా, విదేశీ వస్తువులపై నిషేధం విధించడంతో ఇప్పుడు స్వదేశీ వస్తు సామగ్రికి డిమాండ్‌ పెరిగింది.

Tags:    

Similar News