సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రాజధాని సచివాలయం గ్రాఫిక్స్..

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశాఖను ఆర్థికంగా పరుగులు పెట్టిస్తానంటూ కాబోయే కార్యనిర్వాహక రాజధానిగా ఇలా మారుస్తాం అని ఒక డిజైన్ ను ఇలా చూపించారు.

Update: 2024-03-05 11:16 GMT

దిశ ప్రతినిధి, విశాఖపట్నం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశాఖను ఆర్థికంగా పరుగులు పెట్టిస్తానంటూ కాబోయే కార్యనిర్వాహక రాజధానిగా ఇలా మారుస్తాం అని ఒక డిజైన్ ను ఇలా చూపించారు.అది ప్రజెంట్ సోషల్ మీడియాలో ఒక ఆట ఆడేసుకుంటుంది.గతంలో చంద్రబాబు నాయుడు అమరావతిలో చూపించిన గ్రాఫిక్స్ కి ఇప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గ్రాఫిక్స్ కి ఎటువంటి తేడా లేదంటూ వీరిద్దరి చేతికి చిక్కిన ఆంధ్ర ప్రజల అమాయకులంటూ అదే పనిగా పోస్టింగ్స్ వెల్లువెత్తుతున్నాయి.ఇంకా రెండు నెలల్లో ఎన్నికలు ఉన్నాయనగా ఇప్పుడు విశాఖ వచ్చి గ్రాఫిక్స్ విడుదల చేయడం వల్ల ఉపయోగం ఏమిటని నెటిజన్లు ప్రశ్నలు వర్షం కురిపిస్తున్నారు. చంద్రబాబు అమరావతిలో వాస్తవరూపం దాల్చేలా చూపించి కొంతవరకు నిర్మించిన కట్టడాలు గ్రాఫిక్స్ అయితే.. ఎన్నికలకు నెలరోజుల ముందు జగన్ రెడ్డి విశాఖలో చూపించే గ్రాఫిక్స్ సినిమాను ఏమంటారురా బులుగు భఫూన్స్?" అంటూ ఒక దుమ్మెత్తి పోస్తారు. మరొకరు "సూది బెజ్జం డిజైన్..

వారెవ్వా వాట్టెన్ ఐడియా..ఇడ్లీ పాత్ర నుంచీ సూది బెజ్జం వరకు ఆంధ్రా ప్రయాణం.." అని ఒక ఆట ఆడేసుకున్నారు.ఇంకొకరు మరో అడుగు ముందుకేసి ఆయన ఇడ్లీ పాత్రని ఆయన పట్టకారుతో పట్టుకుని పక్కన పెట్టారు అనాల.. ఏపీకి ప్రాంతీయ పార్టీలు అభివృద్ధి గ్రాఫిక్స్ లో చూపిస్తున్నాయని ఎద్దేవా చేశారు. "మేము కూడా మొదలెట్టేసామోచ్...!! రాజధాని సచివాలయం గ్రాఫిక్స్ మాది తెనాలి మీది తెనాలి మనది తెనాలి..." అని ఇంకొకరు వ్యంగ్యాస్త్రాలు విసిరారు. ఆంధ్రప్రదేశ్ భవనాలు అందుకు విడుదల చేసిన డిజైన్లు వాస్తవ రూపం దాల్చక పోగా వినోదానికి వేదికలవుతున్నాయి. ప్రజెంట్ సోషల్ మీడియాలో సచివాలయం గ్రాఫిక్స్ పై కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

Read More..

జగన్ రెడ్డి వర్సెస్ రేవంత్ రెడ్డి! ఇద్దరిలో బెస్ట్ సీఎం ఎవరో తెలుసా?  

Tags:    

Similar News