నా చేతిలో గంటా ఓటమి ఖాయం: అవంతి శ్రీనివాస్
విశాఖ జిల్లా భీమిలిలో రాజకీయాలు వేడెక్కాయి....
దిశ, వెబ్ డెస్క్: విశాఖ జిల్లా భీమిలిలో రాజకీయాలు వేడెక్కాయి. ఈ నియోజకవర్గంలో వైసీపీ నుంచి అవంతి శ్రీనివాస్, టీడీపీ నుంచి గంటా శ్రీనివాస్ పోటీ చేస్తున్నారు. దీంతో ఉత్కంఠ నెలకొంది. మరోవైపు ఎన్నికల ప్రచారంలో ఇద్దరూ దూసుకుపోతున్నారు. పరస్పరం విమర్శలు చేసుకుంటున్నారు. తాజాగా భీమిలిలో అవంతి శ్రీనివాస్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి ఓట్లు అభ్యర్థిస్తు్న్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తన చేతిలో గంటా శ్రీనివాస్ ఓటమి ఖాయమని చెప్పారు. భీమిలిలో దోచుకునేందుకే గంటా పోటీ చేస్తున్నారన్నారు. అభివృద్ధి గురించి ఆయన ఏనాడు పట్టించుకోదని ఎద్దేవా చేశారు. చంద్రబాబు కాళ్లు పట్టుకుని సీటు తెచ్చుకున్నారని విమర్శించారు. గంటా శ్రీనివాస్ బలమైన అభ్యర్థి కాదని, కాలం చెల్లిన మెడిసిన్ అని అవంతి శ్రీనివాస్ సెటైర్లు వేశారు.