దేశ రాజకీయాలకు సంక్షేమ పాలన నేర్పిన నేత ఎన్టీఆర్:ఎం.భరత్
దేశ రాజకీయాలకు సంక్షేమ పాలన నేర్పిన నేత ఎన్టీఆర్ అని విశాఖ లోకసభ టీడీపీ అభ్యర్థి ఎం.భరత్ అన్నారు. విశాఖ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శుక్రవారం నాయకులు,అభిమానులు, కార్యకర్తల తో కలిసి ఎన్టీఆర్ గారి విగ్రహానికి పూలమాల వేసి జెండా ఎగురవేసి కేక్ కట్ చేశారు.
దిశ ప్రతినిధి,విశాఖపట్నం:దేశ రాజకీయాలకు సంక్షేమ పాలన నేర్పిన నేత ఎన్టీఆర్ అని విశాఖ లోకసభ టీడీపీ అభ్యర్థి ఎం.భరత్ అన్నారు. విశాఖ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శుక్రవారం నాయకులు,అభిమానులు, కార్యకర్తల తో కలిసి ఎన్టీఆర్ గారి విగ్రహానికి పూలమాల వేసి జెండా ఎగురవేసి కేక్ కట్ చేశారు.పార్లమెంట్ అధ్యక్షులు గండి బాబ్జీ,ప్రధాన కార్యదర్శి పొలమరశెట్టి శ్రీనివాసరావు,ఎమ్మెల్సీలు వేపాడ చిరంజీవి రావు, ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు తదితరులు పాల్గొన్నారు. ఆ సందర్భంగా భరత్ మాట్లాడుతూ కందుకూరి వీరేశలింగం, గురజాడ అప్పారావు, పొట్టి శ్రీరాములు, అంబేద్కర్, వంటి మహాశయుల స్ఫూర్తిగా ఎన్టీఆర్ 1982లో ఇదే రోజున తెలుగుదేశం పార్టీని ప్రకటించారని తెలిపారు.
రాజకీయం అంటే అధికారం అనుభవించడం కాదని. ప్రజలకు సేవ చేయడం అంటూ కొత్త నిర్వచనం ఇచ్చారు అన్నారు.ఈ కార్యక్రమంలో జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ పీలా శ్రీనివాసరావు, పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి పొలమరశెట్టి శ్రీనివాసరావు, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గాడు చిన కుమారి లక్ష్మి, కార్పొరేటర్లు గొలగాని వీరారావు బుజ్జి, రాష్ట్ర కార్యదర్శి విఎస్ఎన్ మూర్తి యాదవ్, పార్లమెంట్ ఉపాధ్యక్షులు పైలా ముత్యాల నాయుడు, విల్లూరి చక్రవర్తి, గవర సత్తిబాబు, ఎర్నాగుల జగదీష్, యువత అధ్యక్షులు తాతాజీ, మహిళా ప్రధాన కార్యదర్శి గనగల సత్య, ఈతలపాక సుజాత, దాసన్న సత్యనారాయణ మరియు వార్డు అధ్యక్షులు జిల్లా నాయకులు పాల్గొన్నారు.
Read More..
Ap Elections 2024:ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న టీడీపీ అభ్యర్థి కుమార్తె!